భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ బయో ఎనర్జీ రీసెర్చి ( డి.ఐ.బి.ఇ.ఆర్ ) నుంచి పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.
వివిధ విభాగాలు అయిన కెమిస్ట్రీ , అగ్రికల్చర్ సైన్స్ , మైక్రో బయోలజి/ బయో టెక్నాలజీ , ఫార్మకాలజీ మరియు రెన్యువబుల్ ఎనర్జీ లలో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులలో రీసెర్చి అస్సోసియేట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 54,000/- రూపాయలు మరియు జూనియర్ రీసెర్చి ఫెలో పోస్టులకు నెలకు 31,000/-రూపాయల వరకూ వేతనాలు లభించనున్నాయి.
ఈ పోస్టులకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ధరఖాస్తులు చేసుకునే అవకాశం కలదు. ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల వయసు మించకుండా ఉండాలి.
ముఖ్యమైన తేదిలు :
ఈ పోస్టులకు 22, 23 ఆగస్టు 2022 తేదీల నాడు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
మొత్తం పోస్టులు:
14
విభాగాల వారిగా ఖాళీలు:
డి.ఆర్.డి.ఓ నుంచి విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చి అస్సోసియేట్ 2 పోస్టులను మరియు జూనియర్ రీసెర్చి ఫెలో 12 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
రీసెర్చి అస్సోసియేట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా కెమిస్ట్రీ/ హర్టీకల్చర్ / వెజిటేబుల్ సైన్స్ / అగ్రోనోమి విభాగాలలో పి హెచ్ డి లేదా ఏమ్మెస్సి పూర్తి చేసి 3 సంవత్సరాలు అనుభవాన్ని కలిగి ఉండాలి.
జూనియర్ రీసెర్చి ఫెలో పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా సంభదిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి.ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
మొదటి డివిజన్ లో NET/GATE ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 35-28 సంవత్సరాల ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. SC,ST,PH వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం :
రీసెర్చ్ అసోసియేట్: రూ. HRA మరియు నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలతో నెలకు 54000. జూనియర్ రీసెర్చ్ ఫెలో: రూ. నిబంధనల ప్రకారం HRA మరియు వైద్య సదుపాయాలతో నెలకు 31000.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరినీ కూడా ఎటువంటి వ్రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హజరు కావాలి. DRDO, హల్ద్వానీ, ఉత్తరాఖండ్, పిన్ 263139 తేదీ 22-23 ఆగస్టు 2022 న 10:00 గంటలకు
ఫీజు :
ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments