Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP రైతు భరోసా కేంద్రాలలో భర్తీ చేయనున్న 6,800 పోస్టులు అర్హతలు ఇవే.

AP గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలలో అతి త్వరలో సుమారుగా 6800 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటన విడుదల కావడం జరిగింది. 

ఈ పోస్టులకు సంబంధిత విభాగానికి చెందిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన అర్హులైన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు తమ సొంత జిల్లా లోనే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

AP RBK update in telugu 2023


పోస్టుల వివరాలు:

పోస్టుల వివరాలు గురించి చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలలో

4,656 పశుసంవర్ధక పోస్టులు

1644 ఉద్యాన పోస్టులు

467 వ్యవసాయ పోస్టులు

64 మత్స్య రంగంలో పోస్టులు

23 పట్టు సహాయకులు

త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల కావడం జరిగింది. ఇ ఉద్యోగం కనక సాధిస్తే అభ్యర్థులు సొంత ఊరిలో ఉండే జాబ్ చేసుకోవచ్చును. 

అర్హతలు:

పైన ఇవ్వబడిన పోస్టుల లో ప్రతి పోస్ట్ కి సంబంధిత కేటగిరీలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఉదాహరణకు పశుసంవర్ధక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వెటర్నరీ విభాగంలో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

అదే విధంగా ఉద్యాన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.

మరియు వ్యవసాయ రంగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు B.Sc అగ్రికల్చర్ వంటి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ విధంగా ప్రతి కేటగిరీలో పోస్టులకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే మీకు డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయన్ని సూచనలను కామెట్ రాయండి. 

Post a Comment

0 Comments