పండగ లాటి అధికారిక ప్రకటన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అధికారిక వెబ్‌సైట్ లో ఈ రోజు రెండు అతి ముఖ్యమైన ప్రకటనలు రావడం జరిగింది.
మొదటి ప్రకటన హైకోర్ట్ కి సంబంది రెండు స్పోర్ట్స్ కోటా పొస్ట్‌లకు గాను 51 మందిని DV కి ఎంపిక చేస్తు లిస్ట్ విడుదల చెయ్యడం జరిగింది.
51 మంది అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అనుబంధం-Aలో జాబితా చేయబడ్డారు అని మనం చెప్పుకోవచ్చును.
ధృవీకరణ ప్రక్రియ 29-04-2023న ఉదయం 10:00 గంటలకు జరుగుతుంది. విద్యా అర్హతలు, ఇతర సర్టిఫికేట్స్ సమర్పించవలసి ఉంటుంది.
అభ్యర్థులు 09-08-2012 తేదీన జి.ఓ.ఎం.నెం.74 ప్రకారం ఫారమ్-1/ఫారమ్-2/ఫారమ్-3/ఫారమ్-4ని రిజిస్ట్రీకి సమర్పించాలి.
రిజిస్ట్రీ ఈ ఫారమ్‌లను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి ఫార్వార్డ్ చేస్తుంది.
స్పోర్ట్స్ అథారిటీ ఈ ఫారమ్‌ల ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్ (2 పోస్టులు) పోస్టుకు స్పోర్ట్స్ కోటా కింద నియామకం కోసం అర్హత సర్టిఫికేట్‌లను జారీ చేస్తుంది.
స్పోర్ట్స్ కోటా అపాయింట్‌మెంట్ కోసం పరిగణించబడే అభ్యర్థులకు ధృవీకరణ ప్రక్రియలో హాజరు చాలా కీలకం. అభ్యర్థులు ధృవీకరణ కోసం అవసరమైన అన్ని పత్రాలను తీసుకురావాలి.
మరియు ఈ రోజు రెండో ప్రకటన కూడా హైకోర్ట్ కి సంబందించి రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్ లో పెట్టడం జరిగింది.
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు తాత్కాలికంగా ఎంపికైన 11 మంది అభ్యర్థుల జాబితా 23-02-2023న హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది.
02-03-2023న 11 మంది అభ్యర్థులలో 10 మంది అభ్యర్థులు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత, ఎంపికైన అభ్యర్థులను కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు హైకోర్టు నియమించింది.
నియమితులైన అభ్యర్థులు 29-04-2023లోపు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ జారీ చేసిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌తో పాటు డ్యూటీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here


0 Comments