సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనకు ఏపీ సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ సచివాలయం లో వివిధ శాఖలలో ఇప్పటికే అనేక ఉద్యోగాలను భర్తీ చేసింది.
ఏపీ అటవీశాఖలో ఈ 1500 ఫారెస్ట్ రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్ల అధికారులను నియమించెందుకు అనుమతిను కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేశామని, ప్రభుత్వం నుండి అందుకు తగిన అనుమతులు రాగానే భారీ సంఖ్యలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి తాము సిద్ధం గా ఉన్నామని, వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీ ఫారెస్ట్ పీసీసీఎఫ్ తెలిపారు.
ఏపీ ఫారెస్ట్ రేంజ్ తదితర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డ్ ల నుండి డిగ్రీ ను పూర్తి చేసి ఉండవలెనన్న విషయం మనకు తెలిసిందే.
ఏపీ లో త్వరలో ఈ ఫారెస్ట్ డిపార్టుమెంటు లో భారీ సంఖ్యలో చేపట్టబోయే ఈ నియామకాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ఇప్పటి నుండి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, జనరల్ తెలుగు, ఇంగ్లీష్, మాథ్స్ (పదవ తరగతి ప్రామాణికత), ఫారెస్ట్రీ కు సంబంధించిన అంశాలపై పట్టు సాధిస్తే సులభంగా అటవీశాఖలో ఉద్యోగాన్ని సాధించవచ్చు అని మనం గత నోటిఫికెషన్స్ లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు.
0 Comments