ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికెషన్స్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి.
గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు సమక్షంలో జరిగిన ఏపీపీఎస్సీ మెంబెర్ల సమావేశం జరిగిన సంగతి మనకు విధితమే.
అయితే ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పై పచ్చ జెండా ఊపినా సరే నోటిఫికేషన్స్ విడుదలలో మాత్రం జాప్యం చోటు చేసుకుంది.
జూన్ నెలాఖరు వస్తున్న ఏపీ లో మాత్రం గ్రూప్ 1 మరియు 2 నోటిఫికేషన్స్ విడుదల జాడ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఏపీ లో పలువురు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఆశవాహులు కమిషన్ సభ్యులను సంప్రదించినట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది.
సుమారుగా 1000 పోస్టులకు పైగా వస్తున్న గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఫైల్ ప్రస్తుతం ఏపీ ఆర్థిక శాఖ వద్ద ఉందని, జూలై మొదటి వారం లోపు ఈ పోస్టుల నియామకాలకు చెందిన ఫైల్ కు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపనుందని విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఏపీ ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన వెంటనే 30 రోజుల లోపు ఈ 1000 పోస్టులతో కూడిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, జూలై నెలాఖరు నాటికి లేదా ఆగష్టు మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కావున ఏపీ లో గ్రూప్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నోటిఫికేషన్స్ రావడానికి సమయం ఆసన్నమవుతుంది కనుక మీ మీ ప్రిపరేషన్ లను ఆపకుండా.. కొనసాగించడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments