గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉన్న మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో వివిధ కేటగిరీ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగముల భర్తీనకు ఒక ప్రకటన విడుదల అయినది.
ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేది : జూలై 7, 2023
హార్డ్ కాపీలు చేరుటకు చివరి తేది : జూలై 14, 2023
విభాగాల వారీగా ఖాళీలు :
రీజనల్ డైరెక్టర్ - 2
అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ - 4
ఇన్స్ట్రక్టర్ (పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ ) - 1
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 4
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో మాస్టర్ డిగ్రీ / పీహెచ్డీ / బీఈ/బీటెక్ / డిప్లొమా కోర్సులను పూర్తి చేసి అనుభవం కలిగిన వారు రిజనల్ డైరెక్టర్, అసిస్టెంట్ రిజనల్ డైరెక్టర్, ఇన్స్ట్రక్టర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
MTS ఉద్యోగాలకు :
గుర్తింపు పొందిన బోర్డ్ / ఇన్స్టిట్యూట్ ల నుండి 10 వ తరగతి / ఐటీఐ ఉత్తిర్ణత చెందిన అభ్యర్థులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
30 నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ముందుగా ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు అప్లై చేసుకుని, తదుపరి ఆన్లైన్ అప్లికేషన్ కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
కాండిడేట్స్ కేటగిరీ లను అనుసరించి 150 రూపాయలు నుండి 500 రూపాయలు వరకూ అప్లికేషన్ ఫీజులుగా చెల్లించవలెను.
అన్ని కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 రూపాయలు నుండి 2,09,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
To The Assistant Registrar,
ER - II Section,
Maulana Azad National Urdu University,
Gachibowli,
Hyderabad - 500032.
Official Website
0 Comments