Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో సచివాలయం 3.0 నోటిఫికేషన్ పై ఫుల్ క్లారిటి మీరు ఎవరిని అడవలసిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో సాధారణ డిగ్రీ పూర్తి చేసుకున్న  నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామ / వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీనకు  మూడవ నోటిఫికేషన్ పై  ఆగష్టు నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలలో కీలక పాత్రను గ్రామ మరియు వార్డు సచివాలయంలు పోషిస్తున్నాయనే సంగతి మనకు తెలిసిందే.

AP Grama Sachivalayam Notification Update 2023

ఇప్పటికే రెండు సార్లు గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న విభిన్న కేటగిరీల ఉద్యోగాల భర్తీనకు నోటిఫికేషన్స్ ప్రకటించి, ఖాళీలను భర్తీ చేశారు.

ఇప్పుడు తాజాగా గడిచిన ఏడాదిలలో గ్రామ మరియు వార్డు సచివాలయంలలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు చేపట్టిన  బదిలీల ప్రక్రియ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయంలలో కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలపై ఒక అవగాహనా ఏర్పడుతుంది.

ఇవే గాక ఏపీ లో తాజాగా భర్తీ అయిన హై కోర్ట్, జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్ -3) ఉద్యోగాలకు, గ్రూప్ - 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు గ్రామ మరియు వార్డు సచివాలయంలలో పని చేస్తున్న కొంత మంది అభ్యర్థులు ఎంపికైనట్లు వాస్తవ సమాచారం అందుతుంది.

దాదాపుగా గ్రామ/వార్డు సచివాలయాలలో బదిలీలు మరియు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన  వివిధ ఉద్యోగాలకు గ్రామ / వార్డు సచివాలయంలో విభిన్న కేటగిరీలలో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు సెలక్షన్ కావడం.. వెరసి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఏపీ గ్రామ/వార్డు  సచివాలయం 3.0 నోటిఫికేషన్ లో దాదాపుగా 15,000 పోస్టులకు పైబడి ఉద్యోగాల భర్తీనకు నోటిఫికేషన్ రావడం తథ్యంగా కనిపిస్తుంది.

కాబట్టి ఏపీ రాష్ట్రంలో జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ.. ఈ పరిస్థితులలో  సచివాలయం నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా మన ముందుకు వచ్చే అవకాశం ఉన్నందు వలన ప్రిపరేషన్ ను ప్రారంభించడం మంచిదిగా మనం చెప్పుకోవచ్చు. 

Post a Comment

0 Comments