భారతీయ రైల్వే ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన తాజాగా విడుదల కావడం జరిగింది.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయబడుతాయని నోటిఫికేషన్ లో తెలిపారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనుండడంతో ఇది రైల్వే జాబ్స్ గురించి నిరీక్షించే వారికి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. South Railway Latest Jobs 2023
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : జూన్ 30, 2023.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ టెక్నికల్ అసోసియేట్ :
సివిల్ ఇంజనీర్ (వర్క్స్ ) - 19
ఎలక్ట్రికల్ ( డ్రాయింగ్ ) - 10
ఎస్ & టీ ( డ్రాయింగ్ ) - 6
మొత్తం పోస్టులు :
35 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు :
కేటగిరీలను అనుసరించి సివిల్ / మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /కమ్యూనికేషన్ /కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగాలలో నాలుగు సంవత్సరాల బాచిలర్ డిగ్రీ లేదా మూడు సంవత్సరాల డిప్లొమా / బీఎస్సీ (సివిల్ ఇంజనీరింగ్) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-33 సంవత్సరాల యూఆర్ కేటగిరీ, 18-36 సంవత్సరములు ఉన్న ఓబీసీ కేటగిరీ మరియు 18-38 సంవత్సరాలు ఉన్న ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో నిర్ణిత గడువు చివరి తేదిలోగా ఈ పోస్టులకు అభ్యర్థులు పోస్టు ద్వారా తమ తమ అప్లికేషన్స్ ను పంపించవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ /ఉమెన్ /మైనారిటీ /EWS కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మార్కులు, అనుభవం మరియు పర్సనాలిటీ /ఇంటలిజెన్స్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
To secretary,
To Principal Chief Personnel Officer & Senior Personnel Officer ( Engineering ),
office Principal chief personnel officer,
4th Floor, Personnel Department,
Rail Nilayam, South Central Railway,
Secunderabad, Pin : 500025.
Notification Link Click Here
0 Comments