కేంద్ర ప్రభుత్వ సంస్థలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు, జీతం 56,900 వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, ఇప్పుడే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయింది.
ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో చేపట్టనున్నారు. విభాగాల వారీగా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ అప్లికేషన్ చేరుటకు తేది : జూలై 31, 2023
విభాగాల వారీగా ఖాళీలు :
లోయర్ డివిజనల్ క్లర్క్ - 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 3
అర్హతలు :
MTS :
10వ తరగతి విద్యా అర్హతలుగా కలిగి ఉన్న వారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గార్డెనింగ్ /ఎలక్ట్రికల్ సర్వీసెస్ /క్లీనింగ్ సర్వీసెస్ /వెహికల్ మెకానిక్ /ప్లంబింగ్ /సెక్యూరిటీ డ్యూటీ /హ్యాండ్లింగ్ ఆఫీస్ ఏక్విప్ మెంట్స్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న, లేకున్నా పర్వలేదు.
LDC:
ఇంటర్మీడియట్ అర్హతలుగా కలిగి నిమిషానికి 30 ఇంగ్లీష్ పదములు లేదా 25 హిందీ పదములు టైపింగ్ స్పీడ్ చేయగల సామర్థ్యం ఉన్న వారు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-27 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం :
ఆఫ్ లైన్ విధానంలో నిర్ణిత గడువు చివరి తేదీలోగా అభ్యర్థులు అప్లికేషన్ లను పోస్టు ద్వారా పంపించవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలు ను డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో దరఖాస్తు ఫీజు క్రింద చెల్లించవలెను.
ఎంపిక విధానం :
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు టైపింగ్ ప్రోఫిషియన్సీ /స్కిల్ టెస్ట్ లను నిర్వహించి వ్రాత పరీక్షకు 1:5 రేషియో లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
లోయర్ డివిజన్ క్లర్క్ / మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వ్రాత పరీక్షను నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో నిర్వహించబడుతుంది.100 మల్టీ ఫుల్ ఛాయస్ బిట్స్ తో కూడిన ఓఎమ్మార్ షీట్ విధానంలో పరీక్ష నిర్వహించబడును.
క్వాంటిటీటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటలిజెన్స్ తదీతర అంశాల నుండి ఈ పరీక్షలలో ప్రశ్నలు వస్తాయి.
పరీక్షల నిర్వహణ అనంతరం వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ / మినిమం క్వాలిఫైయింగ్ మార్కులనను సరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు .
మినిమం క్వాలిఫయింగ్ మార్కులు :
జనరల్ - 50 %
ఓబీసీ - 45 %
ఎస్సీ /ఎస్టీ - 40 %
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ పంపుటకు చిరునామా :
The Director,
Institute of Forest Biodiversity,
Dulapally,
Kompally S. O.,
Hyderabad - 500100.
0 Comments