Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Mega DSC నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే ? పూర్తి క్లారిటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నాలుగు సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ( టీచర్ రిక్రూట్మెంట్ ) నోటిఫికేషన్ విడుదల ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినా సరే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.

AP Mega DSC Update 2023

మొన్న జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో సుమారుగా 10,000 ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. వాటిని రాబోయే రోజుల్లో వచ్చే డీఎస్సీ లో భర్తీ చేయనున్నట్లుగా మనకు అనధికారిక సమాచారం వెలువడుతుంది.

రాబోయే ఏడాది ఏపీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండడంతో ఖచ్చితంగా ఏపీలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగే పరిస్థితులు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. మొన్నటి బదిలీలలో బ్లాక్ చేసిన 10,000 పోస్టులు మరియు రాబోయే ఏడాదిలో టీచర్స్  రిటైర్మెంట్ లను కలుపుకుని సుమారుగా 15,000 పోస్టుల పైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

రాబోయే రెండు మూడు నెలల్లో లేదా వచ్చే నెల జూలై చివరి నాటికి  ఏపీ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికెషన్ (టీచర్స్ రిక్రూట్మెంట్ ) విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ ఒక ప్రకటన చేయడం ఖాయంగా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది.

కావున గడిచిన నాలుగేళ్ళ నుండి విరామం లేకుండా ఏపీ డీఎస్సీ గురించి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని నిరాశ పడకుండా మీ మీ ప్రిపరషన్స్ ను కొనసాగించడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు. 

Post a Comment

0 Comments