వైఎస్ఆర్ యూనివర్సిటీ, విజయవాడ లో కంప్యూటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు,31,500 రూపాయలు జీతం, సమయం లేదు, ఇప్పుడే అప్లై చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ లో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనకు ఒక ప్రకటన విడుదల అయినది. ఈ పోస్టులను పూర్తిగా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మొత్తం వివరాలు ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లై కు చివరి తేది : జూన్ 27, 2023
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : జూలై 5,2023
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : జూలై 13, 2023
ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ నిర్వహణ తేది : త్వరలో
విభాగాల వారీగా ఉద్యోగాలు - ఖాళీలు :
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - 02
కంప్యూటర్ ఆపరేటర్ - 05
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 06
మొత్తం ఖాళీలు :
13 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సీఎస్ఈ /ఐటీ /ఈసీఈ విభాగాలలో బీటెక్ కంప్లీట్ చేసి సంబంధిత విభాగాలలో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ /డిగ్రీ తో కూడిన పీజీడిసీఏ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
డిగ్రీ అర్హతగా కలిగి పీజీడిసీఏ / డీసీఏ అర్హతలుగా ఉన్న అభ్యర్థులు డేటా ఎంట్రీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
18-42 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.
దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకూ ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను అనుసరించి మెరిట్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
75 % మార్కులు విద్యార్హతలకు మరియు 25 % మార్కులు స్కిల్ టెస్ట్ కు కేటాయించినట్లుగా నోటిఫికేషన్ లో తెలిపారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,500 రూపాయలు నుండి 31,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments