ఇప్పుడు మనం రెండు నోటిఫికేషన్స్ గురించి చూద్దం :
1) రైల్వే లో ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఒక అద్బుతమైన అవకాశం రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చును. అయితే ఇది ఒక అప్రెంటీస్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చును. ఈ అప్రెంటీస్ పిరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. అప్రెంటీస్ సమయంలో మీకు స్టైఫ్‌న్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అయితే అప్రెంటీస్ పిరియడ్ పూర్తి చేసిన తరువాత మీకు NAC సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల ఉండే లాభం ఏమిటంటే కొత్త రైల్వే గ్రూఫ్ డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు 20% కోటా పోస్ట్ లు అప్రెంటీస్ చేసిన వారికి కేటాయించబడతాయి. దీనినే CCAA కోటా అంటారు.
ఇప్పుడు వెస్ట్‌రన్ రైల్వే కి సంబందించి 3624 అప్రెంటీస్ పోస్ట్ ల భర్తీకి సంబందించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అపై చేసుకోవచ్చును.
మొత్తం ఖాళీలు : 3624
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది : 27/06/2023 11.00 గంటలు
అప్లై చేసుకొవడానికి చివరి తేది : 26/07/2023 17.00 గంటలు
అర్హతలు :
పదోతరగతి తో పాటు సంబందింత విభాగం లో ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
15-24 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
ఫీజు చెల్లింపు:
దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు) – రూ. 100/-, SC/ST/PWD/మహిళలు దరఖాస్తుదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పూర్తి సమాచరం నోటిఫికేషన్ కొరకు ఇక్కడా క్లిక్ చెయ్యండి Click Here
2) మరో నోటిఫికేషన్ :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైసెస్ కు చెందిన మినీ రత్న కంపెనీ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC),ఈస్ట్ జోన్, కోల్ కత్తా లో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ ట్రైనీస్ పోస్టుల భర్తీనకు సంబంధించిన ఒక ప్రకటన విడుదలయినది.
ఈ ట్రైనీ అప్ప్రెంటీస్ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనుండడం మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 29, 2023
ట్రేడ్ ల వారీగా ఖాళీలు :
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 25
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డ్ ల నుండి 50% మార్కులతో మెట్రీక్యూలేషన్ ను పూర్తి చేసి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఎన్సీవీటీ /ఎస్సీవీటీ నుండి ఐటీఐ సర్టిఫికెట్ ను పొంది ఉన్న అభ్యర్థులు అందరూ ఈ 12 నెలల అప్ప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
15 - 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ వీటికి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ లకు 3 సంవత్సరాలు, ఎక్స్ - సర్వీస్ మెన్ మరియు దివ్యంగులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మార్కులను అనుసరించి మెరిట్ లిస్ట్ ను తయారుచేసి, తదుపరి అభ్యర్థుల మెరిట్ ను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ అప్ప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి నెలకు 7,000 రూపాయలు వరకూ స్టై ఫండ్ ను ఇవ్వనున్నారు.
0 Comments