ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది.
సమాచర హక్కు ప్రకారం ( RTI) ప్రజ రవాణ శాఖ ఈ ఖాళీ వివరాలు తెలపడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ లో ప్రస్తుతం 1093 డ్రైవర్ పోస్టులు, ఇతర కేటగిరీలు కలుపుకుని 6,580 పోస్టుల వరకూ ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.
అయితే గతంలో కూడా మనకి ఈ విధమైన వార్తలే రావడం జరిగింది. కాని ఏ విధమైన నోటిఫికేషన్ రాలేదు. AP లో RTC నోటిఫికేషన్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఎప్పటినుంచో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లకు సంబందించి నోటిఫికేషన్ త్వరగా రావలి అని మనం కోరుకుందాం.
ఇటివల కారుణ్య నియమాకాల ద్వారా కొన్ని పోస్ట్ లను భర్తీ చేసిన ఇంకా చాలా విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు :
డ్రైవర్లు - 1093
డిప్యూటీ మెకానిక్స్ - 215
సహాయ మెకానిక్స్ - 1517
కోచ్ బిల్డర్స్ - 194
ఎలక్ట్రీషియన్స్ - 158
పెయింటర్స్ - 113
కంట్రోలర్స్ - 520
వల్కనైజర్స్ - 117
టైపిస్ట్ - 151
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న ఈ ఖాళీలను త్వరలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ లో పోస్టుల భర్తీ గురించి లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీపై ఖచ్చితంగా దృష్టి వహిస్తుందని మనం ఆశిద్దాం.
0 Comments