Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP పోలీస్ PET PST నిర్వహణకు టెండర్ నోటిస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6500 పోలీస్, ఎస్సై ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే ఫీజికల్ ఈవెంట్స్ (PET) లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ నుండి ఒక అధికారిక ప్రకటన అయితే తాజాగా వెలువడినది.

6100 కానిస్టేబుల్స్ మరియు 411 ఎస్సై ఖాళీలను అర్హులైన అభ్యర్థులచేత నింపడానికి గానూ  గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రకటన విడుదల కాగా,ఈ పోస్టుల భర్తీలో భాగంగానే 2023, జనవరిలో అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి.

AP police PET and PST Update 2023

మొత్తం 6100 పోలీస్ పోస్టుల భర్తీనకు నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో కానిస్టేబుల్ పోస్టులకి   95,208 మంది ఎస్సై పోస్టులకు 25,000 మంది ఫీజికల్ ఈవెంట్స్ కు ఎంపిక అయ్యారు.

సుమారుగా ఎంపిక కాబడిన లక్ష మందికి పైగా అభ్యర్థులకి  ఫీజికల్ ఈవెంట్స్ ను  మార్చి 14, 2023 వ తేదీన నిర్వహించాల్సి ఉన్న అనూహ్య కారణాల వల్ల ఈ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి.

తాజాగా కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ఫీజికల్ ఈవెంట్స్ ను నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ సంసిద్ధం అయినట్లుగా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే సీసీటీవీ సర్వీలైన్స్ క్రింద 1600/100 మీటర్స్ పరుగుల(రన్) ఈవెంట్స్ నిర్వహణ చేయడంలో భాగంగా డిజిటల్ హైట్ /వెయిట్ /చెస్ట్ కొలతలు తీసుకోవడానికి, ఆర్ఎఫ్ఐడీ రేస్ సిస్టమ్ ద్వారా పీఎంటీ మరియు పీఈటీ ఈవెంట్స్ నిర్వహించడంనకు ఏపీ పోలీస్ టెండర్స్ ను కోరుతూ ఒక ప్రకటనను ఏపీ పోలీస్ శాఖ విడుదల చేసినది.

ఈ నెల 4 తేదిన టెండార్ ఐడి 640508 తో టెండార్ కి పిలవడం జరిగింది. అయితే టెండార్ వెయ్యడానికి గడువు ఈ నెల 25 వరకు ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఈ టెండర్ నోటిస్ చూడాలి అనుకుంటే టెండార్ Ap eprocurement వెబ్‌సైట్ లోని వెళ్ళండి. ఆ యొక్క వెబ్‌సైట్ లో కివెళ్ళి సెర్చ్ బార్ లో 640508 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి అప్పుడు టెండార్ నోటిస్ మీ కు కనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రిలీజ్ చేసిన ఈ ప్రకటన ద్వారా 6500 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీ లో భాగంగా నిర్వహించే ఫీజికల్ ఈవెంట్స్ గురించి జూలై నెల ఆఖరులోగా లేదా ఆగష్టు మొదటి వారం లోపులోనే ఒక అధికారిక ప్రకటన వెలువడడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Post a Comment

0 Comments