ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిరుద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనకు ఒక ప్రకటన విడుదల అయినది.
ఈ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా పరిగణనిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఆగష్టు 14, 2023
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నికల్ అసిస్టెంట్ - 3
టెక్నీషియన్ - 1
ల్యాబ్ అటెండెంట్ - 1 - 35
మొత్తం పోస్టులు :
46 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టులలో మొదటి శ్రేణి మార్కులతో డిగ్రీ / మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు.
55 శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టు కలిగి ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు మరియు డిప్లొమా ఇన్ మెడికల్ లేబర్యాటరీ టెక్నాలజీ /కంప్యూటర్ /స్టాటస్టిక్స్ ఫీల్డ్ లలో ఒక సంవత్సరం డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు టెక్నీషియన్ - 1 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
50 శాతం మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి, ప్రభుత్వ గుర్తింపు పొందిన / రిజిస్టర్డ్ ల్యాబ్ లో లేదా సంబంధిత ఫీల్డ్ లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
25-30 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నియమాలను అనుసరించి వయసు సడలింపు పరిమితి లేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని, తదుపరి దరఖాస్తులను నింపి, సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి సంబంధిత చిరునామాకు స్పీడ్ / రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలును అప్లికేషన్ ఫీజులుగా చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు మరియు అన్ని కేటగిరీలకు చెందిన మహిళ అభ్యర్థులు ఎటువంటి ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / మెరిట్ / ఇంటర్వ్యూ విధానాలను ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,500 నుండి 1,12,400 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులను పంపవల్సిన చిరునామా :
The Director,
ICMR- National Animal Resource Facility for Biomedical Research,
Genome Valley,
Kolthur (P. O),
Shamirpet (M),
Hyderabad,
Telangana - 500 101.
0 Comments