Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో 6500 పోలీస్ ఉద్యోగాల భర్తీ కి ఏమిజరిగింది కదలిక ఎప్పుడు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6500 ఎస్సై, కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది.

ఏపీ లో 6100 కానిస్టేబుల్స్ మరియు 411 ఎస్సై పోస్టుల భర్తీనకు గడిచిన సంవత్సరం 2022 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల అయినా సంగతి మనకు విధితమే. ఈ పోస్టుల భర్తీలో భాగంగానే 2023, జనవరిలో అభ్యర్థులకు  ప్రిలిమ్స్ పరీక్షలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించింది. 

AP police Latest update 2023

మొత్తం 6100 పోలీస్ పోస్టుల భర్తీనకు నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యి  కానిస్టేబుల్ పోస్టుల ఈవెంట్స్ కు 95,208 మంది మరియు ఎస్సై పోస్టుల ఈవెంట్స్ కు 25,000 మంది సెలెక్ట్ అయ్యారు.

ఈ తరుణంలో ఈ పోస్టుల భర్తీ లో భాగంగా అభ్యర్థులకు  నిర్వహించే ఫీజికల్ ఈవెంట్స్ కు మార్చి 14, 2023 వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా ఒక షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు .

పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా నడుస్తున్న ఈ సందర్భంలోనే ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎలక్షన్స్ కోడ్ వల్ల అభ్యర్థులకు నిర్వహించవలసిన ఈవెంట్స్ వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే 6500 పోలీస్ పోస్టుల భర్తీ లో భాగంగా నిర్వహించవల్సిన ఫీజికల్ ఈవెంట్స్ ప్రక్రియ వాయిదా పడి సుమారుగా మూడు నెలలుకు పైగా సమయం పూర్తి అయినా సరే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనను సంబంధిత వర్గాలు చేయలేదు.

దీనితో, ఏపీ లో పోలీస్ పోస్టుల భర్తీనకు నిర్వహించిన  ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఫీజికల్ ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తున్న లక్షకు పైగా ఉన్న అభ్యర్థులు తమకు అతి త్వరగా  ఈవెంట్స్ ను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు తమ తమ వినతులను అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే  త్వరలోనే 6500 పోలీస్ పోస్టుల భర్తీలో ముఖ్యమైన పాత్ర వహించబోతున్న ఫీజికల్ ఈవెంట్స్ పై ఒక ముఖ్యమైన ప్రకటన రావడానికి అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. 

Post a Comment

0 Comments