భారతీయ రైల్వే లో భారీ సంఖ్యలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కు సంబంధించిన ప్రకటనలు వివిధ డివిజన్ల నుండి వెలువడినవి. ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.
ఒకేసారి నాలుగు డివిజన్ల నుండి సుమారుగా 6404 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయడం ఇక్కడ అభ్యర్థులకు వచ్చిన ఒక గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవచ్చు.
ఈ అప్రెంటీస్ పోస్టులలో జాయిన్ అయిన అభ్యర్థులకి రాబోయే రోజుల్లో జరిగే ఇండియన్ రైల్వేస్ ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది 20% పోస్ట్ లను మీకు కేటాయించడం జరుగుతుంది. మరియు అప్రెంటీస్ పిరియడ్ లో స్టైఫెన్ద్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అనగా కొంత వరం జీతం లాంటిదన్న మాట.
డివిజన్ల వారీగా భర్తీ చేయబోయే పోస్టుల ట్రేడ్ లు :
ఫిట్టర్ / కార్పెంటర్ / వెల్డర్ / ఎలక్ట్రీషియన్ /copa/స్టేనోగ్రాఫర్ /ప్లంబర్ /పెయింటర్ /వైర్ మెన్ /ఎలక్ట్రానిక్ మెకానిక్ / డీజిల్ మెకానిక్ /టర్నర్ /డెంటల్ లేబర్యాటరీ టెక్నీషియన్ /హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ /హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్ /గ్యాస్ కట్టర్ / కేబుల్ జాయింటర్ / రిఫ్రిజీరేటర్ (ఏసీ - మెకానిక్ )/పైప్ ఫిట్టర్ /డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్ )/ మెషినిస్ట్ /టర్నర్ /
డివిజన్ల వారీగా వివరాలు :
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే :
దరఖాస్తులకు చివరి తేది - జూలై 7, 2023.
మొత్తం ఖాళీలు - 772
వెస్ట్రన్ రైల్వే :
దరఖాస్తులకు చివరి తేది - జూలై 26, 2023
మొత్తం ఖాళీలు - 3624
నార్త్ ఈస్ట్రన్ రైల్వే :
దరఖాస్తులకు చివరి తేది - ఆగష్టు 2, 2023
మొత్తం ఖాళీలు - 1104
( నార్త్ ఈస్ట్రన్ రైల్వే లో వివిధ డివిజన్లలో ఉన్న మెకానికల్ / సిగ్నల్ / బ్రిడ్జ్ / డీజిల్ షెడ్ /క్యారేజ్ వాగన్ షెడ్ లలో 1104 ఖాళీలను భర్తీ చేయనున్నారు. )
సౌత్ వెస్ట్రన్ రైల్వే :
దరఖాస్తులకు చివరి తేది - ఆగష్టు 2, 2023.
మొత్తం ఖాళీలు - 904
( సౌత్ వెస్ట్రన్ రైల్వేలో వివిధ డివిజన్లలో క్యారేజ్ రిపేర్ / సెంట్రల్ వర్క్ షాప్ లలో 904 పోస్టులను భర్తీ చేయనున్నారు.)
విద్యా అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డ్ ల నుండి 50% మార్క్స్ తో 10వ తరగతి ఉత్తిర్ణత చెంది, సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
15-24 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
100 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక చేసే విధానం :
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం విద్యా అర్హతల మార్కులు, పెర్సెంటేజ్ లను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టై ఫండ్ :
సెంట్రల్ అప్ప్రెంటీస్ షిప్ కౌన్సిల్ ను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు స్టై ఫండ్ ను ఇస్తారు.
0 Comments