ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమైన నగరాలలో ఒకటైన విశాఖపట్నం నుండి ఒక ముఖ్యమైన ఉద్యోగ ప్రకటన తాజాగా వెలువడినది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీనకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 31, 2023
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) అప్ప్రెంటీస్ - 200
డిప్లొమా ఇంజనీరింగ్ అప్ప్రెంటీస్ - 50
అప్ప్రెంటీస్ పోస్టులకు చెందిన బ్రాంచులు :
బీఈ / బీటెక్ :
మెకానికల్ / ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కంప్యూటర్ సైన్స్ /ఐటీ/మెటలార్జీ/ఇన్స్ట్రుమెంటేషన్ /సివిల్ /కెమికల్ /ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ /సెరెమిక్స్.
డిప్లొమా :
మెకానికల్ / ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /సివిల్ /మైనింగ్ /సెరెమిక్స్ /మెటాలర్జీ/కెమికల్ /కంప్యూటర్ సైన్స్ /ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్.
విద్యా అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన తెలిపిన బ్రాంచులలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డ్ ల నుండి 2021/2022/2023 సంవత్సరాలలో ఇంజనీరింగ్ /డిప్లొమా ఉత్తిర్ణత ను చెంది ఉండి, MHRD NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ను ఖచ్చితంగా చేసుకుని ఉండవలెను.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో మొదట రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి గూగుల్ ఫామ్ ను నింపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్ లను అనుసరించి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 9000 రూపాయలు వరకూ స్టై ఫండ్ ను ఇవ్వనున్నారు.
0 Comments