రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షల ప్రిపరేషన్ లో మోడల్ పేపర్స్ ను ప్రాక్టీస్ చేయడం చేయడం వల్ల అభ్యర్థులు పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించడానికి వీలు ఉంటుంది.
రాబోయే డిసెంబర్ నెల లో మొదలయ్యే రైల్వే బోర్డు -2020 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తాజా కరెంట్ అఫైర్స్-2020 మరియు గత ప్రశ్నపత్రాలలో వచ్చిన బిట్స్ ను సిలబస్ వారీగా జతపరచి RRB మోడల్ పేపర్స్ ను మీకు అందించడం జరుగుతుంది.
RRB మోడల్ పేపర్ -2020 :
1).ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన గాలిని పీల్చాలని ఇటీవల భారతీయ రైల్వే ఎయిరోగార్డ్ అనే కన్సల్టెన్సీ సహకారంతో నాసిక్ రైల్వే స్టేషన్ లో ఆక్సిజన్ పార్లర్ ను ప్రారంభించింది. అయితే నాసిక్ రైల్వే స్టేషన్ ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?
A).ఆంధ్రప్రదేశ్
B).తెలంగాణ
C).మహారాష్ట్ర
D).ఒరిస్సా
సమాధానం : " C " ( మహారాష్ట్ర ).
2). ఈ క్రింది వారిలో భారత దేశ తొలి రక్షణ దళాల అధిపతిగా జనవరి -1, 2020 న బాధ్యతలు స్వీకరించినవారు ఎవరు?
A).జనరల్ బిపిన్ రావత్
B).మనోజ్ ముకుంద్ నరవనే
C).సురేష్ చంద్ర శర్మ
D).ఏ. పి. మహేశ్వరీ.
సమాధానం : " A "(జనరల్ బిపిన్ రావత్ ).
3). జాతీయ సుపరిపాలన దినోత్సవం (డిసెంబర్ -25)ను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు?
A).శ్రీ పీ. వీ. నరసింహారావు.
B).శ్రీ అటల్ బిహారీ వాజపేయి.
C).శ్రీ రాజీవ్ గాంధీ.
D).శ్రీ చరణ్ సింగ్.
సమాధానం :" B " ( శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ).
4).ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికైన వారు?
A).అష్రఫ్ ఘనీ.
B).అబ్దుల్లా.
C).ఇమ్రాన్ ఖాన్.
D).ఏకాటెరిని.
సమాధానం : " A " ( అష్రాఫ్ ఘనీ ).
5).ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం ' నాగోబా జాతర ' ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరుగుతుంది. అయితే ఈ జాతర జరిగే భారతీయ రాష్ట్రం ?
A).తెలంగాణ
B).ఒరిస్సా
C).మధ్యప్రదేశ్.
D).ఆంధ్రప్రదేశ్
సమాధానం : " A " ( తెలంగాణ ).
6).అంతరిక్షంలో సుదీర్ఘ కాలం 328 రోజులు గడిపిన తొలి మహిళగా రికార్డు సృష్టించినవారు?
A).క్రిస్టినా కోచ్.
B).పెగ్గీ విట్సన్.
C).జెస్సికా మెయిర్.
D).పర్మిటానో.
సమాధానం : " A " ( క్రిస్టినా కోచ్ ).
7).లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో ఆగష్టు 4, 2020 నాడు సంభవించిన భారీ పేలుడు కు కారణమైన పారిశ్రామిక రసాయనం?
A).సోడియం హైడ్రాక్సైడ్
B).అమ్మోనియం నైట్రేట్.
C).కార్బన్ డై ఆక్సైడ్.
D).సోడియం కార్బోనేట్.
సమాధానం : " B " ( అమ్మోనియం నైట్రేట్ ).
8).భారతదేశంలో తొలి కిసాన్ రైలు ప్రారంభం అయిన తేదీ?
A).ఆగష్టు 7, 2020.
B).ఆగష్టు 15, 2020.
C).సెప్టెంబర్ 5, 2020.
D).అక్టోబర్ 2, 2020.
సమాధానం : " A " ( ఆగష్టు 7, 2020 ).
9).అంగారకుడి పైకి అధునూతనమైన 'పర్సెవరెన్స్' రోవర్ ను ప్రయోగించిన దేశం?
A).అమెరికా.
B).చైనా.
C).రష్యా.
D).భారత్.
సమాధానం : " A " ( అమెరికా ).
10).74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత కేంద్ర ప్రభుత్వం మరణం అనంతరం అందించే 'కీర్తి చక్ర పురస్కారం - 2020' ని ఎవరికీ ప్రధానం చేసారు?
A).మహేంద్రకుమార్ పాసవాన్.
B).అబ్దుల్ రషీద్ కలాస్.
C).సతీష్ ప్రసాద్ కుశ్వాహా.
D).విశాక్ నాయర్.
సమాధానం : " B " ( అబ్దుల్ రషీద్ కలాస్ ).
11).చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టు కాలం?
A).8 నిముషాలు.
B).1.28 సెకన్లు.
C).3 సెకన్లు.
D).2.36 సెకన్లు.
సమాధానం : " B " ( 1.28 సెకన్లు ).
12).న్యూటన్ రెండవ సూత్రం తెలియజేయునది?
A).బలం యొక్క నిర్వచనం.
B).జడత్వం యొక్క నిర్వచనం.
C).ద్రవ్యవేగం యొక్క నిర్వచనం.
D).బలం యొక్క నిర్వచనం.
సమాధానం : " A " ( బలం యొక్క నిర్వచనం ).
13).సూర్యుని తర్వాత మనకు అతి దగ్గరగా గల నక్షత్రం?
A).ఆల్ఫా సెంటారీ.
B).మిల్కీ వే (పాల పుంత ).
C).కాపెల్ల.
D).బెటిల్గీస్.
సమాధానం : " A " ( ఆల్ఫా సెంటారీ ).
14).సూర్య కేంద్రక సిద్దాంతం ను ప్రతిపాదించినవారు?
A).కోపర్నికస్.
B).టాలెమీ.
C).హుక్.
D).న్యూటన్.
సమాధానం : " A " ( కోపర్నికస్ ).
15).వజ్రం మెరవడానికి క్రిందివానిలో ఏది కారణం?
A).కాంతి వక్రీభవనం.
B).కాంతి వివర్తనం.
C).కాంతి సంపూర్ణంతర పరావర్తనం.
D).కాంతి పరావర్తనం.
సమాధానం : " C " ( కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ).
16).సముద్రయాన దూరాలను కొలుచుటకు ఉపయోగించు ప్రమాణం?
A).ఫారడే.
B).నాటికల్ మైల్.
C).బార్.
D).ఆంపియర్.
సమాధానం : " B " ( నాటికల్ మైల్ ).
17).బ్లీచింగ్ పౌడర్ నందు ఉపయోగించు హాలోజెన్లు?
A).ఫ్లోరిన్.
B).క్లోరిన్.
C).బ్రోమిన్.
D).అయోడిన్.
సమాధానం : " B " ( క్లోరిన్ ).
18).క్రిందివానిలో అత్యధిక వక్రీభవన గుణకం కలిగినది?
A).వజ్రం.
B).టంగ్ స్టన్.
C).గ్రాఫైట్.
D).సిలికాన్.
సమాధానం : " A " ( వజ్రం ).
19).వాతావరణ పీడనాన్ని కొలుచు సాధనం?
A).థెర్మో మీటర్.
B).భారమితి.
C).గ్రావిటో మీటర్.
D).టేకో మీటర్.
సమాధానం : " B " ( భారమితి ).
20).ఫార్మిక్ ఆమ్లం వేటి నుండి ఉత్పత్తి చేయబడుతుంది?
A).బొద్దింకలు.
B).చీమలు.
C).ఎలుకలు.
D).చెద పురుగులు.
సమాధానం : " B " ( చీమలు ).
21).విటమిన్ - "B" లోపం వల్ల సంక్రమించే వ్యాధి?
A).బెరి బెరి.
B).రికెట్స్.
C).కీళ్ల వాతం.
D).మధుమేహం.
సమాధానం : " A " ( బెరి బెరి ).
22).కలరా, జాండిస్ మొదలైన వ్యాధులు ఏ కాలుష్యం వలన కలుగును?
A).గాలి.
B).నీరు.
C).నేల.
D).ధ్వని.
సమాధానం : " B " ( నీరు ).
23). క్రింది వారిలో జీవశాస్త్ర పితామహుడు ఎవరు?
A).అరిస్టాటిల్.
B).లిన్నేయస్.
C).మెండల్.
D).డీవ్రిస్.
సమాధానం : " A " ( అరిస్టాటిల్ ).
24).రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
A).విటమిన్ - ఏ.
B).విటమిన్ - బీ.
C).విటమిన్ - సీ.
D).విటమిన్ - డీ.
సమాధానం : " A " ( విటమిన్ - ఏ ).
25).రక్తం గడ్డ కట్టుటకు అవసరమైన విటమిన్ ఏది?
A).విటమిన్ - డీ.
B).విటమిన్ - ఈ.
C).విటమిన్ - కే.
D).విటమిన్ - ఏ.
సమాధానం : " C " ( విటమిన్ - కే ).
26).రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది?
A).35 శాతం.
B).45 శాతం.
C).55 శాతం.
D).65 శాతం.
సమాధానం : " C " ( 55 శాతం ).
27).ఈ క్రింది వానిలో ఏ వ్యాధి సోకితే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది?
A).డెంగ్యూ జ్వరం.
B).క్షయ.
C).చికెన్ గున్యా.
D).కలరా.
సమాధానం : " A " ( డెంగ్యూ జ్వరం ).
28).నింబిన్ ను దేని నుండి తయారు చేస్తారు?
A).వేప.
B).మామిడి.
C).కాఫీ.
D).పొగాకు.
సమాధానం : " A " ( వేప ).
29).DNA నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు?
A).వాల్డెయార్.
B).వాట్సాన్.
C).క్రిక్.
D). B మరియు C.
సమాధానం : " D " ( వాట్సాన్ మరియు క్రిక్ ).
30).సుగంధ ద్రవ్యాల రారాజుగా పిలువబడేవి?
A).కొత్తిమీర.
B).ధనియాలు.
C).యాలకులు.
D).లవంగాలు.
సమాధానం : " D " ( లవంగాలు ).
31).అంతరిక్షం లోనికి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు ఎవరు?
A).జే. ఆర్. డీ. టాటా.
B).రాకేష్ శర్మ.
C).రాకేష్ వర్మ.
D).ఎవరు కాదు.
సమాధానం : " B " ( రాకేష్ శర్మ ).
32). క్రింది వానిలో క్రయోజనిక్ ఇంజన్ లో ఇంధనంగా ఉపయోగపడే ఇంధనం?
A).ద్రవ ఆక్సిజన్.
B).ద్రవ హైడ్రోజన్.
C).ఘన రూప గ్యాస్ పెల్లెట్స్.
D).సహజ యురేనియం.
సమాధానం : " B " ( ద్రవ హైడ్రోజన్ ).
33).ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ గలదు?
A).డెహ్రాడూన్
B).మౌంట్ అబూ
C).ముస్సోరి
D).ఉద్దంపూర్
సమాధానం : " A " ( డెహ్రాడూన్ ).
34).భారత అణుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
A).విక్రమ్ సారాభాయ్
B).హోమి జహంగీర్ బాబా
C).అబ్దుల్ కలాం
D).రాజా రామన్న
సమాధానం : " B " ( హోమి జహంగీర్ బాబా ).
35).భారతదేశం తమ తొలి అణు పరీక్షలను తొలిసారిగా 1974 మే 18న ఎక్కడ నిర్వహించింది?
A).ఫోఖ్రాన్ ( రాజస్థాన్ ).
B).జాదుగూడ ( బీహార్ ).
C).ఫోఖ్రాన్ (మహారాష్ట్ర ).
D).జాదుగూడ ( ఝార్ఖండ్ ).
సమాధానం : "A" (ఫోఖ్రాన్ - రాజస్థాన్ ).
36).ఒక కిలో బైట్ ఎన్ని బైట్ లకు సమానం?
A).1024 బైట్స్
B).280 బైట్స్
C).300 బైట్స్
D).400 బైట్స్
సమాధానం : " A " ( 1024 బైట్స్ ).
37)."స్వచ్ఛ భారత్" పథకాన్ని ఎపుడు ప్రవేశపెట్టారు?
A).అక్టోబర్ 2, 2013
B).అక్టోబర్ 2, 2014
C).అక్టోబర్ 2, 2015
D).అక్టోబర్ 2, 2016.
సమాధానం : " B " ( అక్టోబర్ 2, 2014 ).
38).ప్రపంచ వాతావరణ దినోత్సవం ను ఎపుడు జరుపుకుంటారు?
A).జనవరి 23
B).మార్చ్ 23
C).సెప్టెంబర్ 23
D).డిసెంబర్ 23
సమాధానం : " B " ( మార్చ్ 23 ).
39).భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
A).1984
B).1985
C).1986
D).1987
సమాధానం : " A " ( 1984 ).
40). క్రింది వారిలో ఎవరిని "బర్డ్ మాన్ ఆఫ్ ఇండియా " అని ఎవరిని పిలుస్తారు?
A). రాజేంద్రసింగ్
B).సలీమ్ అక్బర్
C).సలీమ్ అలీ.
D).ఎం. ఎస్. స్వామినాధన్
సమాధానం : " C " ( సలీమ్ అలీ ).
41).క్రింది వానిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?
A).స్తూపం
B).విహారం
C).సంఘం
D).చైత్యం
సమాధానం : " C " ( సంఘం ).
42). " ప్రజ్ఞా పారమిత సూత్ర శాస్త్ర " గ్రంథకర్త ఎవరు?
A).అశ్వ ఘోషుడు
B).వసుమిత్రుడు
C).నాగార్జునుడు
D).చరకుడు
సమాధానం : " C " ( నాగార్జునుడు ).
43).సంగం యుగంలో 'వెల్లాలర్ ' అని ఎవరిని పిలిచేవారు?
A).వ్యవసాయదారుడు
B).స్వర్ణకారుడు
C).కమ్మరి
D).చర్మకారుడు
సమాధానం : " A " ( వ్యవసాయదారుడు ).
44).కుషాణులు ఏ తెగకు చెందినవారు?
A).హుణులు
B).పార్థియన్లు
C).స్లావ్
D).యూచి
సమాధానం : " D " ( యుచి ).
45).చోళుల కాలంలో గ్రామసభలను ఏమని పిలిచేవారు?
A).ఉర్
B).గ్రిహ్
C).అసెంబ్లీ
D).మహాసభ
సమాధానం : " A " ( ఉర్ ).
46). " శుద్ధాద్వైతం " ను ప్రచారం చేసినవారు?
A).నామదేవుడు
B).వల్లభాచార్యులు
C).రామానుజుడు
D).తుకారాం
సమాధానం : " B " ( వల్లభాచార్యులు ).
47)."అకల్ తక్త్ " ను నిర్మించినది ఎవరు?
A).గురు హరగోవింద్
B).గురు రాందాస్
C).గురు అర్జున్ దేవ్
D).గురు గోవింద్ సింగ్
సమాధానం : " A " ( గురు హర గోవింద్ ).
48).ఈ క్రింది వానిలో భారతదేశంలో ఏ తేదీన ప్రాథమిక విధుల దినోత్సవం నిర్వహించబడుతుంది?
A).జనవరి 3
B).నవంబర్ 14
C).అక్టోబర్ 2
D).జూన్ 25
సమాధానం : " A " ( జనవరి 3 ).
49).' మినీ రాజ్యాంగం ' గా ఏ రాజ్యాంగ సవరణని అభివర్ణిస్తారు?
A).40
B).42
C).44
D).48
సమాధానం : " B " ( 42 ).
50).పార్లమెంట్ అనగా....?
A).రాజ్యసభ + రాష్ట్రపతి
B).రాష్ట్రపతి + లోకసభ
C).రాష్ట్రపతి + ప్రధానమంత్రి + అటార్నీ జనరల్
D).రాష్ట్రపతి + రాజ్యసభ + లోకసభ
సమాధానం : " D " ( రాష్ట్రపతి + రాజ్యసభ + లోకసభ )
51). Z=78, NET=117 అయిన NUT =?
A).150
B).420
C).165
D).580
సమాధానం : " C " ( 165 ).
52). 1, 2, 6, 24, 120, ---
A).240
B).360
C).480
D).720
సమాధానం : " D " ( 720 ).
53).ఈ రోజు మంగళవారం అయితే 62 రోజుల తర్వాత వచ్చు వారం?
A).సోమవారం
B).మంగళవారం
C).ఆదివారం
D).శనివారం
సమాధానం : " A " ( సోమవారం ).
54).మొదటి 36 సహజ సంఖ్యల మొత్తం?
A).666
B).766
C).800
D).75
సమాధానం : " A " ( 666 ).
55).ఒక విద్యార్థికి తెలుగులో 60, గణితంలో 82, సైన్స్ లో 79, సాంఘిక శాస్త్రంలో 63 మార్కులు వచ్చిన అతని సరాసరి మార్కులు ఎన్ని?
A).61
B).71
C).89
D).91
సమాధానం : " B " ( 71 ).
56).మొదటి పది ప్రధాన సంఖ్యల సగటు?
A).12.9
B).12
C).13
D).10
సమాధానం : " A " ( 12.9 ).
57). 4 వరుస సరి సంఖ్యల సరాసరి 27.వాటిలో కనిష్ట సంఖ్య ఏది?
A).23
B).22
C).25
D).24
సమాధానం : "D" (24).
58). 90, 75, 18 ల అనుపాత చతుర్థ పదం?
A).15
B).30
C).25
D).20
సమాధానం : "A" (15 ).
59).పువ్వు :పండు :: పండు : ?
A).ఆకు
B).కూరగాయలు
C).విత్తనం
D).మొక్క
సమాధానం : "C"( విత్తనం ).
60).రెండు సంఖ్యల నిష్పత్తి 12:19.వాటి మొత్తం 217 అయిన వాటిలో పెద్ద సంఖ్య?
A).153
B).204
C) 168
D).133
సమాధానం : " D " ( 133 ).
61).మొదటి 50 సహజ సంఖ్యల సగటు?
A).12.25
B).21.25
C).25
D).25.5
సమాధానం : " D " ( 25.5 ).
62).4 వరుస సరిసంఖ్యల సరాసరి 27.వాటిలో కనిష్ట సంఖ్య ఏది?
A).23
B).22
C).25
D).24
సమాధానం : " D " ( 24 ).
63).1 నుండి 100 వరకూ గల ప్రధాన సంఖ్యలు ఎన్ని?
A).25
B).24
C).23
D).29
సమాధానం : " A " ( 25 ).
64). దేశం : రాష్ట్రపతి :: పాఠశాల : ?
A).తల్లితండ్రులు
B).గ్రంధాలయ అధికారి
C).ప్రధానోపాధ్యాయుడు
D).ఇన్విజిలేటర్
సమాధానం : " C " ( ప్రధానోపాధ్యాయుడు ).
65).ఈ క్రింది సిరీస్ ను పూర్తి చేయుము?
Q, N, K, H, (...)
A).G
B).F
C).E
D).I
సమాధానం : " C " ( E ).
66).క్రింది వాటిలో తేడాగా ఉన్నదాన్ని గుర్తించుము?
A).చెవి
B).హృదయం
C).ముక్కు
D).నాలుక
సమాధానం : " B " ( హృదయం ).
67).ఈ క్రింది వానిలో భిన్నమైన పదాన్ని కనుగొనుము.
A).కంప్యూటర్
B). ఎక్స్ - రే
C).రేడియో
D).టెలివిజన్
సమాధానం : " B " ( ఎక్స్ - రే )
68).ఆర్నిథాలజి : పక్షి :: సైటాలజి :?
A).కణం
B).అణువు
C).జంతువు
D).మొక్కలు
సమాధానం : " A " ( కణం ).
69).AKBAR ను GPFDT గా వ్రాసినట్లైతే SWING ను ఏ విధంగా రాస్తారు?
A).YBLQI
B).YBMQH
C).YBMQI
D).YBMIQ
సమాధానం : " C " ( YBMQI ).
70).క్రింది వానిలో భిన్నమైనది ఏది?
A).DEF
B).GJM
C).NQT
D).BEH
సమాధానం : " A " ( DEF ).
71).ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించుము.
A).47-74
B).49-96
C).63-36
D).97-79
సమాధానం : " B " ( 49-96 ).
72).క్రింది వానిలో భిన్నమైనది ఏది?
A).PNK
B).XUR
C).HEB
D).IFC
సమాధానం : " A " ( PNK ).
73).ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది?
A).ఫీజియోలజీ
B).అనాలజి
C).సైకాలజీ
D).సోషియాలజీ
సమాధానం : " B " ( అనాలజి ).
74).10, 12, 18, 30, 50,?
A).88
B).78
C).80
D).74
సమాధానం : " C " ( 80 ).
75). 2, 22, 198, 1386,?
A).2770
B).3990
C).6930
D).9702
సమాధానం : " C " ( 6930 )
76).ఆగ్నేయం ఉత్తరం, అయినచో ఈశాన్యం పశ్చిమం అవుతుంది. అప్పుడు పశ్చిమం ఏమవుతుంది?
A).ఈశాన్యం
B).వాయువ్యం
C).ఆగ్నేయం
D).నైరుతి
సమాధానం : " C " ( ఆగ్నేయం ).
77).రమ్య యొక్క తల్లి మా అమ్మ యొక్క ఏకైక కూతురు అని రవి చెప్పినచో రవి రమ్యకు ఏమవుతాడు?
A).తండ్రి
B).మావయ్య
C).సోదరుడు
D).తాత
సమాధానం : " C " ( సోదరుడు ).
78).నవంబర్ 3 శనివారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలు ఉంటాయి?
A). 6
B).5
C).4
D)3
సమాధానం : " C " ( 4 ).
79).BANK : CBOL :: MORE :?
A).EROM
B).NPSF
C).PSFN
D).ROME
సమాధానం : " B " ( NPSF ).
80).పాఠశాల : ఉపాద్యాయుడు :: న్యాయస్థానం : ?
A).వకీలు
B).ఆట
C).టెన్నిస్
D).న్యాయం
సమాధానం : " A " ( వకీలు ).
81).రెండు సంఖ్యల వృత్యాసం 43.వాటి లబ్దం 1344.అయిన ఆ సంఖ్యల మొత్తం?
A).85
B).88
C).92
D).ఏది కాదు
సమాధానం : " A " ( 85 ).
82).కొంత మొత్తాన్ని ఏడాదికి 5 శాతం వడ్డీతో మూడేళ్ళలో అయ్యే చక్రవడ్డీ 2, 522 రూపాయలు అయితే అసలు ఎంత?
A).12, 522 రూపాయలు
B).15, 200 రూపాయలు
C).16, 000 రూపాయలు
D).17, 200 రూపాయలు
సమాధానం : " C " ( 16, 000 రూపాయలు ).
83).15, 14 ల వర్గాల మొత్తం ఒక ఖచ్చిత వర్గం అయ్యేందుకు ఆ మొత్తానికి కలపాల్సిన కనిష్ట సంఖ్య ఎంత?
A).17
B).20
C).11
D).9
సమాధానం : " B " (20 ).
84).ఒక హాస్టల్ లో ఉన్న 180 మంది విద్యార్థులకు 20 రోజులకు సరిపోయే ఆహారం ఉంది. ఎంత మంది విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోతే ఆహరం 25 రోజులకు సరిపోతుంది?
A).36 మంది.
B).24 మంది.
C).28 మంది.
D).40 మంది.
సమాధానం : " A " ( 36 మంది ).
85).రెండు వరుస డిస్కౌంట్ లు 12%, 5% లకు సమానమైన ఏక డిస్కౌంట్ విలువ ఎంత?
A).17%
B).8.5%
C).16.4%
D).15.2%
సమాధానం : " C " ( 16.4 %).
86).కాంపాక్ట్ డిస్క్ లో ఉపయోగించే సాంకేతికత ఏమిటి?
A).ఎలక్ట్రికల్
B).లేజర్
C).ఎలెక్ట్రోమాగ్నటిక్
D).ఏరో నాటికల్
సమాధానం : " B " ( లేజర్ ).
87).స్మితా ఒక పనిని 12 రోజుల్లో, గీత అదే పనిని 9 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఇద్దరు కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత పని వదిలి వేస్తే, ఇంకా మిగిలిన పని ఎంత?
A).1/2
B).7/9
C).2/9
D).1/4
సమాధానం : " C " ( 2/9 ).
88).మొదటి ఆరు ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత?
A).14/3
B).3
C).41/6
D).13/2
సమాధానం : " C " ( 41/6 ).
89). ఒక కోడ్ భాషలో ఉత్తరం = పడమర, దక్షిణం = తూర్పు, తూర్పు = ఉత్తరం అయితే సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు?
A).తూర్పు
B).పడమర
C).ఉత్తరం
D).దక్షిణం
సమాధానం : " C " ( ఉత్తరం ).
90).పిల్లి : ఎలుక అయితే పాము :?
A).సరీసృపాలు
B).ముంగీస
C).రంద్రం
D).విషం
సమాధానం : " B " ( ముంగీస ).
91).రెండు సంఖ్యల లబ్దం 35828, గ. సా. భా. 26 అయితే క. సా. గు?
A).931788
B).689
C).1378
D).3583
సమాధానం : " C " ( 1378 ).
92).7, 10, 15, 21 మరియు 28 లచే నిస్సేషంగా భాగించబడు ఐదు అంకెల గరిష్ట సంఖ్య ఏది?
A).99840
B).99900
C).99960
D).99990
సమాధానం : "C" ( 99960 ).
93).COW= 41, GOAT = 43 అయితే DOG =?
A).47
B).38
C).25
D).26
సమాధానం : " D " ( 26 ).
94).B కు A కుమారుడు, C కు తండ్రి. అయితే C కు B ఏమి అవుతాడు?
A).తండ్రి
B).కుమారుడు
C).తాత
D).మనువడు
సమాధానం : " C " ( తాత ).
95).AMERICA = 1734651, INDIA=68961 అయితే CANADA = ?
A).719181
B).518191
C).519581
D).715148
సమాధానం : " B " ( 518191 ).
96). ఒక బైట్ =?
A).10 బిట్ లు
B).8 బిట్ లు
C).1024 బిట్ లు
D).100 బిట్ లు
సమాధానం : " B " ( 8 బిట్ లు ).
97).ఒక కిలో బైట్ (KB) ఎంతకు సమానం?
A).1000 బైట్ లు
B).1023 బైట్ లు
C).1024 బైట్ లు
D).100 బైట్ లు
సమాధానం : " C " ( 1024 బైట్ లు ).
98).ఒక గిగా బైట్ =?
A).10, 000 బైట్ లు
B).1024 కిలో బైట్ లు
C).1000 బైట్ లు
D).1024 మెగా బైట్ లు
సమాధానం : "D" ( 1024 మెగా బైట్ లు ).
99).వరల్డ్ వైడ్ వెబ్ (www) ను కనుగొన్నది?
A).టిమ్ - బెర్నెర్స్ -లీ
B).చార్లెస్ బాబేజ్
C).జాన్ హోప్ కిన్స్
D).జాన్ నేపియర్
సమాధానం : " A " ( టిమ్ - బెర్నెర్స్ - లీ ).
100).క్రింది వాటిలో ఏది సామాజిక వెబ్ సైట్ కాదు?
A).ఆర్కుట్
B).పేస్ బుక్
C).ట్విట్టర్
D).ఫ్లిప్ కార్ట్
సమాధానం : " D " ( ఫ్లిప్ కార్ట్ ).
టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
More Current Affairs
More Current Affairs
Railway NTPC Model Paper
More AP jobs Today
DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ
Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్
DMHO లో మరిన్ని ఉద్యోగాలు
ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
0 Comments