RRB ఎన్టీపీసీ మరియు గ్రూప్ -డీ పరీక్షలు దగ్గరపడుతున్నవేళ అభ్యర్ధులు పరీక్షల ప్రిపరేషన్ ను మరింత వేగంగా పూర్తి చేయవల్సిన అవసరం ఉంది.
అభ్యర్ధులు మీ ప్రిపరేషన్ తో పాటు వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయగలిగితే పరీక్షల్లో విజయం సాధించి భారతీయ రైల్వే బోర్డు లో చక్కటి ఉద్యోగం సాధించవచ్చు.
RRB -2020 మోడల్ బిట్స్ :
1) ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆసుపత్రి అయిన "సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ " ను భారతదేశం లో ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
A). ఢిల్లీB).బెంగళూరు
C)చెన్నై
D).హైదరాబాద్.
సమాధానం : " A " ( ఢిల్లీ ).
2) ఆసియా లోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ " రీవా " లో ప్రారంభం అయింది. అయితే 'రీవా' భారతదేశంలో ఏ రాష్ట్రంలో గలదు?
A). ఉత్తరప్రదేశ్
B).మధ్య ప్రదేశ్
C).ఆంధ్రప్రదేశ్
D).బీహార్
సమాధానం : " B " ( మధ్యప్రదేశ్ ).
3) అంతర్జాతీయ 'వాన్ కర్మన్ అవార్డు -2020'ను అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ ( ఐఏఏ ) క్రింది వారిలో ఎవరికీ ప్రకటించింది?
A). కే. శివన్
B).రఘురాంరాజన్
C).కస్తూరి రంగనాథ్
D).కే. రాధాకృష్ణ
సమాధానం : " A " ( కే. శివన్ ).
4) క్రింది వానిలో భారత్ - చైనా ల మధ్య సరిహద్దు రేఖ కానిది?
A).మెక్ మోహన్ రేఖ
B).వాస్తవాధీన రేఖ
C).రాడ్ క్లిఫ్ రేఖ
D).క్లెయిమ్ లైన్
సమాధానం :" C " ( రాడ్ క్లిఫ్ రేఖ ).
5) అంతరిక్ష రంగంలో మార్స్ (అంగారక )గ్రహానికి ఆర్బిటర్ ను పంపిన తొలి అరబ్ దేశంగా ఏ దేశం ఘనత సాధించింది?
A).సౌథీ అరేబియా
B).ఇరాన్
C).ఒమాన్
D).యూ. ఏ. ఈ
సమాధానం : " D " ( యూ ఏ ఈ ).
6) 'నమస్తే ట్రంప్ ' కార్యక్రమంని నిర్వహించిన భారత క్రికెట్ మైదానం పేరు?
A).మోతేరా స్టేడియం (అహ్మదాబాద్ )
B).చిన్న స్వామి స్టేడియం ( బెంగళూరు )
C).వాంఖడే స్టేడియం (ముంబై )
D).రాజీవ్ గాంధీ స్టేడియం ( హైదరాబాద్ )
సమాధానం : " A " ( మోతేరా స్టేడియం -అహ్మదాబాద్ ).
7) కరోనా వైరస్ లో కరోనా అనే పదానికి అర్థం ఏమిటి?
A).కీరిటం
B).క్రిములు
C).సిండ్రోమ్
D).బాక్టీరియా
సమాధానం : " A " ( కీరిటం ).
8) ఫిబ్రవరి 8, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ఎన్నవ సారి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు?
A).మొదటి సారి
B).రెండవ సారి
C).మూడవ సారి
D).నాల్గవ సారి
సమాధానం : " C " ( మూడవ సారి ).
9) ఈ క్రింది వానిలో దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా పేరుగాంచిన నగరం?
A).హైదరాబాద్ మెట్రో
B).ఢిల్లీ మెట్రో
C).కోలకత్తా మెట్రో
D).చెన్నై మెట్రో
సమాధానం : " A " ( హైదరాబాద్ మెట్రో ).
10) పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశిక పఠనం తప్పనిసరి చేసిన భారతదేశ రాష్ట్రం?
A).ఆంధ్రప్రదేశ్
B).మహారాష్ట్ర
C).ఉత్తరప్రదేశ్
D).రాజస్థాన్
సమాధానం : " B " ( మహారాష్ట్ర ).
11) చర్యకు ప్రతిచర్య అనునది?
A). న్యూటన్ మొదటి గమన నియమం
B).న్యూటన్ రెండవ గమన నియమం
C).న్యూటన్ మూడవ గమన నియమం
D).ఏదికాదు
సమాధానం : " C " (న్యూటన్ మూడవ గమన నియమం ).
12) డెసిబుల్ అనునది?
A).ఒక సంగీత సాధనం
B).ఒక సంగీత సంకేతం
C).ధ్వని తీవ్రతకు ప్రమాణం
D).ధ్వని యొక్క తరంగ దైర్గ్యం.
సమాధానం : "C" (ధ్వని తీవ్రతకు ప్రమాణం ).
13) సముద్రపు నీటి నుండి ఉప్పును తయారుచేయు పద్దతి?
A).ఉత్పతనం
B).ఇగురబెట్టుట
C).స్పటికి కరణం
D).వడపోత
సమాధానం : " B " ( ఇగురబెట్టుట ).
14) అష్టక విన్యాసం లేని జడ వాయువు ఏది?
A).హీలియం
B).నియాన్
C).ఆర్గాన్
D).క్రిప్టాన్
సమాధానం :"A" ( హీలియం ).
15) పరమాణు వ్యాసార్థాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?
A).ఆర్మ్ స్ట్రాంగ్
B).amu
C).ఎర్గ్స్
D).ఏదికాదు
0 Comments