Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Exam Top 10 Bits latest Telugu | రైల్వే పరీక్షకు సంబందించి అతి ముఖ్యమైన బిట్స్ ఇప్పుడే చూడండి.

లైక్ చేస్తున్న విద్యార్థులకు మా ప్రత్యక ధన్యవాదము-telugucompetitive.com


రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్షలకు స్వల్ప కాలవ్యవధి ఉన్నందువల్ల సిలబస్ వారీగా ముఖ్య అంశాలపై దృష్టి సారించాలి. 


రాబోయే నెల డిసెంబర్ -2020 లో రైల్వే పరీక్షలు మొదలవనున్న నేపథ్యంలో వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్ ) అంశాలపై అభ్యర్థులు పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. RRB Exam Top 10 Bits latest Telugu

ఈ తరుణంలో,,  2020 జనవరి నుంచి ప్రస్తుతం వరకూ ఉన్న  అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలన్నిటిని ఒక చోట చేర్చి మారుతున్న ప్రశ్నవళిని దృష్టిలో పెట్టుకుని  మీ పరీక్షలకు అవసరమయ్యే  మోడల్ బిట్స్  ని అందిస్తున్నాము. 

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

RRB మోడల్ కరెంట్ అఫైర్స్ -2020 బిట్స్ :

1). 71 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న " జెయిర్ మిసియాస్ బొల్సోనారో ". ఏ దేశానికి చెందిన అధ్యక్షులు? 

A).జపాన్

B).రష్యా

C).బ్రెజిల్

D).అమెరికా

సమాధానం : C ( బ్రెజిల్ ).


2). పద్మ భూషణ్ అవార్డు -2020 కి  మణిపూర్ కు చెందిన మేరీకోమ్ ఎంపికయ్యారు. అయితే మేరీకోమ్ ఏ విభాగంలో ఈ అవార్డు కు ఎంపిక అయ్యారు?


A).కళలు

B).క్రీడలు

C).వైద్యం

D).ప్రజావ్యవహారాలు

సమాధానం : B ( క్రీడలు ).


3). 107వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 2020 సంవత్సరం జనవరి 3 నుంచి 7 వ తారీఖు వరకూ నిర్వహించారు.అయితే ఈ సమావేశాలును ఎక్కడ నిర్వహించారు? 


A).తమిళనాడు రాజధాని చెన్నై.

B).కర్ణాటక రాజధాని బెంగళూరు.

C).తెలంగాణ రాజధాని హైదరాబాద్.

D).బీహార్ రాజధాని పాట్నా.

సమాధానం : B ( కర్ణాటక రాజధాని బెంగళూరు ).


4).రైల్వే ల సురక్షితమైన ఏడాదిగా ఈ క్రింది వానిలో ఏ సంవత్సరాన్ని భారతీయ రైల్వే బోర్డు ప్రకటించింది? 


A).2018

B).2019

C).2020

D).2017

సమాధానం : B ( 2019 ).


5).భారత రైల్వేలో అన్ని సేవలకు ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ ను రైల్వే శాఖ జనవరి 2, 2020 న ప్రకటించింది. అయితే ఈ క్రింది వానిలో భారతీయ రైల్వే శాఖ ప్రకటించిన రైల్వే హెల్ప్ లైన్ నెంబర్? 


A).138

B).139

C).182

D).183

సమాధానం : B ( 139 ).


6). ఈ క్రింది వారిలో ఆగష్టు 8, 2020 నాడు 14 వ భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) గా నియమితులు అయినవారు? 


A).సత్య పాల్ మాలిక్

B).గిరీష్ చంద్ర ముర్ము

C).ప్రదీప్ కుమార్ జోషి

D).రాకేష్ ఆస్తానా

సమాధానం : B ( గిరీష్ చంద్ర ముర్ము ).


7). ఇటీవల ఇస్రో ప్రయోగించిన వాహన నౌక పేరు?


A).PSLV  C - 46

B).PSLV  C -  47

C).PSLV  C  - 48

D).PSLV  C  - 49

సమాధానం : D  ( PSLV C - 49 ).


8).దేశీయంగా అభివృద్ధి పరిచిన మొట్ట మొదటి అణుశక్తి గల జలాంతర్గామి? 


A).INS అరిహంత్

B).INS  చక్ర

C).INS సింధ్ ఘోష్

D).INS వేల

సమాధానం : A ( INS అరిహంత్ ).

9).ఈ క్రింది వానిలో భారతదేశ  దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రచన కానిది? 


A).ఆఫ్ ది ట్రాక్

B).ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్

C).ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్

D).ది ఇండియా వే

సమాధానం :  D ( ది ఇండియా వే ).

10). క్రింది వారిలో ' ఏ ప్రామిస్డ్ ల్యాండ్ 'అనే పుస్తకాన్ని రచించినవారు? 


A).డోనాల్డ్ ట్రంప్

B).బరాక్ ఒబామా

C).జై శంకర్

D).మనోహర్ పారికర్

సమాధానం : B ( బరాక్ ఒబామా ).


11).క్రిందివారిలో  కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ గా నవంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినవారు? 


A).యశ్వర్ధన్ కుమార్ సిన్హా

B).అక్షయ్ కుమార్ సింగ్

C).వి. కే. దుగ్గల్

D).విదిషా మైత్రా

సమాధానం : A  ( యశ్వర్ధన్ కుమార్ సిన్హా ).


12).ఫైర్ డిటెక్సల్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?


A).DRDO

B).ISRO

C).IBM

D).IIF

సమాధానం : A ( DRDO ).


13).తొలి 6 G ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం? 


A).రష్యా

B).అమెరికా

C).జపాన్

D).చైనా

సమాధానం : D ( చైనా ).


14).ఈ క్రింది వానిలో ప్రపంచ పులుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?


A).జూలై 26

B).జూలై 27

C).జూలై 28

D).జూలై 29

సమాధానం : D ( జూలై 29 ).

15). చెక్కు లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు కొత్తగా ఏ పద్దతిని తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది? 


A).ఫోన్ - పే

B).పాజిటివ్ - పే

C).గూగుల్ - పే

D).పేటీఎం

సమాధానం : B ( పాజిటివ్ - పే ). 

Post a Comment

0 Comments