Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Exams 2020 Current Affairs Round Up || ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?

భారతీయ రైల్వే బోర్డు -2020 పరీక్షలు అతిత్వరలో ప్రారంభం అవుతున్న సందర్భంలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పై ప్రత్యేక శ్రద్ద వహించవలసిన అవసరం ఉంది.

ముఖ్యం గా 2020వ సంవత్సరం జనవరి నెల నుండి ప్రస్తుత  నవంబర్ నెల వరకూ జరిగిన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ విభాగాలకు చెందిన అన్ని అంశాలపై అభ్యర్థులు పట్టు సాధించాలి. ఈ తరుణంలో  జనవరి -నవంబర్ వరకూ జరిగిన ముఖ్య సంఘటనలను అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమైన బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాము.

కరెంట్ అఫైర్స్ -2020 మోడల్ బిట్స్ :

1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం?


A). ఆంధ్రప్రదేశ్

B). బీహార్

C). సిక్కిం

D). మహారాష్ట్ర

సమాధానం : D ( మహారాష్ట్ర ).


2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు?


A). అమెరికా

B). రష్యా

C). చైనా

D).స్విట్జర్లాండ్

సమాధానం : D ( స్విట్జర్లాండ్ ).


3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది?


A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్

B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్

C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్

D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్

సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ).


4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు?


A). మిగ్ -21

B). మిగ్ -25

C). మిగ్ -27

D). మిగ్ -29

సమాధానం :  D ( మిగ్ -27 ).

5).భారత దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా క్రింది ఏ నగరపు మెట్రో రికార్డు సృష్టించింది?


A). బెంగళూరు మెట్రో

B). హైదరాబాద్ మెట్రో

C). చెన్నై మెట్రో

D). కలకత్తా మెట్రో

సమాధానం : B ( హైదరాబాద్ మెట్రో ).


6). ఇటీవల టామ్ 2 అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఈ క్రింది ఏ భారతదేశ నగరం తొలిస్థానంలో నిలిచింది?


A). హైదరాబాద్

B). న్యూ ఢిల్లీ

C). చెన్నై

D). బెంగళూరు

సమాధానం : D (బెంగళూరు ).


7). రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ కాలం వరకూ కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలకు ఇటీవలే రష్యా ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారు.ఈ క్రమంలో పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?


A).2025

B).2035

C).2036

D).2042

సమాధానం : C ( 2036 ).


8).భారతదేశ 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఆగష్టు 31వ తేదీన మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను ప్రకటించింది?


A).2015

B).2017

C).2019

D).2020

సమాధానం : C ( 2019 ).


9). జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న  ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆగష్టు 2022 కు పూర్తయ్యే అవకాశం ఉంది.అయితే ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?


A). గంగోత్రి

B). రావి

C). చీనాబ్

D). సట్లైజ్

సమాధానం : C ( చీనాబ్ ).


10).ఇటీవల పుస్తక విక్రయ రంగంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా " ఏ ప్రామిస్డ్ ల్యాండ్ " అనే పుస్తకం నూతన రికార్డులను సృష్టిస్తోంది. అయితే క్రింది వారిలో ఎవరు "ఏ ప్రామిస్డ్ ల్యాండ్" పుస్తకాన్ని రచించారు?


A). డోనాల్డ్ ట్రంప్

B). జో బైడెన్

C). జై శంకర్

D). బరాక్ ఒబామా

సమాధానం : D ( బరాక్ ఒబామా ).


11.మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో  ఇటీవల 10 లక్షల ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన  తొలి బ్యాంకుగా  రికార్డును సృష్టించిన బ్యాంకు ఏది?


A).రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా

B). మెక్సికో సెంట్రల్ బ్యాంకు

C). బ్యాంకు ఆఫ్ ఇండోనేషియా

D). అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు

సమాధానం : A ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ).


12). సముద్రయాన రంగంలో దేశీయ సాంకేతిక ప్రాబల్యాన్ని పెంచేలా  నూతనంగా హైటెక్ ఓడను ఆవిష్కరించిన పరిశోధకులు ఏ ఐఐటీ కీ చెందినవారు?


A). ఐఐటీ ఖరగ్ పూర్

B). ఐఐటీ బెంగళూరు

C). ఐఐటీ మద్రాస్

D). ఐఐటీ ఢిల్లీ

సమాధానం : C ( ఐఐటీ మద్రాస్ ).


13).2023 వ సంవత్సరంలో G-20 సమ్మిట్ ను ఈ క్రింది వానిలో ఏ దేశం నిర్వహించబోతుంది?


A). రష్యా

B). ఇండియా

C). యూ ఎస్ ఏ

D). యూ ఏ ఈ

సమాధానం : B ( ఇండియా ).


14). నవంబర్ 23,2020 న WWE కు వీడ్కోలు పలికిన ప్రముఖ ప్లేయర్ ఎవరు?


A).ట్రిపుల్ హెచ్

B). కాన్ విల్లియమ్స్

C). అండర్ట్  కేర్

D).జాన్ సేనా

సమాధానం : C ( అండర్ట్ కేర్ ).


15). ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్( ఐఎస్ఎల్ ) 7వ సీజన్  నవంబర్ 20,2020 న భారత్ లో  ఎక్కడ ప్రారంభం అయ్యాయి?


A). మధ్య ప్రదేశ్

B). ఉత్తర ప్రదేశ్

C). ఆంధ్రప్రదేశ్

D). గోవా

సమాధానం : D ( గోవా ).

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి. 

Post a Comment

0 Comments