Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Exmas ( Group-4 and NTPC) Model bits Telugu 2020 | రైల్వే పరీక్షలో వచ్చే అతి ముఖ్యమైన బిట్స్ మిస్ కాకండి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు -2020 పరీక్షల సిలబస్ ను  అంశాల వారీగా అధ్యయనం చేస్తూ, ఆయా సబ్జెక్టుల అంశాలను ప్రాక్టీస్ చేయడం అనేది మీ పరీక్షలలో మంచి ఫలితాలను ఇస్తాయి  అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 


గత రైల్వే ప్రశ్న పత్రాలలో వచ్చిన జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను అన్నిటిని ఒక చోట చేర్చి ముఖ్యమైన బిట్స్ ను మీకు అందిస్తున్నాము.


రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు - 2020 పరీక్షలు - మోడల్ బిట్స్ :


1).భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం ఏది? 


A). బొగ్గు

B).ఇనుము

C).సిలికాన్

D).నత్రజని

సమాధానం : C ( సిలికాన్ ).

2). నిమ్మ, నారింజ పళ్ళలో గల ఆమ్లం?

A).ఎసిటిక్ ఆమ్లం

B).హైడ్రోక్లోరికామ్లం

C).సిట్రికామ్లం

D).ఆక్సలికామ్లం

సమాధానం : C ( సిట్రికామ్లం ). 

3). మహాభారతం అసలు పేరు ఏమిటి? 

A).వ్యాస గీతం

B).బ్రహ్మ సంహిత

C).జయ సంహిత

D).బృహత్కథ

సమాధానం : C ( జయ సంహిత ). 

4).సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? 

A).గుజరాత్

B).మహారాష్ట్ర

C).పంజాబ్

D).రాజస్థాన్

సమాధానం : A ( గుజరాత్ )


5).హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయట పడింది?


A).క్రీ. శ. 1912

B).క్రీ. శ. 1921

C).క్రీ. శ. 1922

D).క్రీ. శ. 1925

సమాధానం : B ( క్రీ. శ. 1921 ).


6). రఘువంశ గ్రంథ కర్త ఎవరు?


A). సముద్ర గుప్తుడు

B). కాళిదాసు

C). బాణుడు

D). హర్షుడు

సమాధానం : B ( కాళిదాసు ). 

7). శంకరాచార్యులు ప్రచారం చేసిన తత్త్వం ఏది? 


A).అద్వైతం

B).ద్వైతం

C).హీనయానం

D).మహాయానం

సమాధానం : A ( అద్వైతం ). 

8). మొట్టమొదటి భారతదేశ లోకసభ సమావేశం అయిన తేదీ మరియు సంవత్సరాలు  వరుసగా...? 

A).మే 13, 1952

B).జనవరి 26, 1950

C).ఆగష్టు 15, 1947

D).ఫిబ్రవరి 28, 1949

సమాధానం : A ( మే 13, 1952 ). 

9).భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? 

A).ఎం. ఎస్. స్వామి నాథన్

B).వి. కురియన్

C).కే. ఎస్. బహల్

D).బి. పి. పాల్

సమాధానం : B ( వి. కురియన్ ). 


10).చోళుల కాలంలో గ్రామసభ లను ఏమని పిలిచేవారు? 


A).ఉర్

B).గ్రిహ్

C).అసెంబ్లీ

D).మహాసభ

సమాధానం : A ( ఉర్ ). 


11). వైరస్ మరియు బాక్టీరియా ల గురించిన అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?  


A).మాక్రో బయాలజీ


B).మైక్రో బయాలజీ

C).మైకాలజి

D).ఫైకాలజి

సమాధానం : B ( మైక్రో బయాలజీ ). 


12).మానవుని దేహంలో ఉండే అతిచిన్న ఎముక ఏది? 


A).మాలియాస్


B).ఇంకస్

C).స్టేపియస్

D). ఫీమార్

సమాధానం : C ( స్టేపియస్ ). 


13).విటమిన్ - D శాస్త్రీయ నామం?


A).రెటినాల్


B).కాల్సిఫెరాల్

C).టోకోఫెరల్

D).ఫీల్లోక్వినోన్

సమాధానం : B ( కాల్సిఫెరాల్ )


14).డచ్ వారు తమ మొదటి ఫ్యాక్టరీ ని ఎక్కడ స్థాపించారు? 


A).సూరత్

B).కాలికట్

C).మచిలీపట్నం

D).కరైకల్

సమాధానం : C ( మచిలీపట్నం ). 

15).తిలక్ స్థాపించిన కేసరి పత్రిక ఏ భాషలో వెలువడింది? 

A).ఇంగ్లీష్

B).హిందీ

C).గుజరాతి

D).మరాఠి

సమాధానం : D ( మరాఠి ).  

Post a Comment

0 Comments