పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, వెస్టర్న్ రైల్వే లో భారీగా రైల్వే పోస్ట్‌లు, ఇరు తెలుగు రాష్ట్రాలవారు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వే , ముంబై లో గల డివిజన్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 3591 రైల్వే పోస్ట్‌ల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) తాజాగా విడుదల చేసినది.
ఈ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియలో ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను నిర్వహించడం లేదు అని ఈ నోటిఫికేషన్ లో పొందుపరచడం అభ్యర్థులకు అద్భుతమైన వార్త అని చెప్పవచ్చును.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలుస్తుంది.
కేవలం మెరిట్ ఆధారంగా భారీ సంఖ్యలో భర్తీ కాబోతున్న 3591 కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
2021-2022 సంవత్సరానికి గాను ఈ రైల్వే అప్ప్రెంటీస్ పోస్ట్‌లు నోటిఫికేషన్ ప్రకటిస్తున్నట్లు వెస్టర్న్ రైల్వే ఈ ప్రకటనలో తెలిపినది.
రైల్వే గ్రూఫ్-డి మెటీరియల్ కొరకు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి. 8179492829 మెటీరియల్ PDF రూపంలో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : మే 25 , 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : జూన్ 24, 2021
డివిజన్ల వారీగా ఖాళీలు :
ముంబై (MMCT) డివిజన్ - 738
వడోధర (BRC)డివిజన్ - 489
అహ్మదాబాద్ డివిజన్ - 611
రాట్లం (RTM) డివిజన్ - 434
రాజ్ కోట్ (RJT) డివిజన్ - 176
భావననగర్ (BVP) డివిజన్ - 210
లోయర్ పారెల్ (PL) W/షాప్ - 396
మహాలక్ష్మి (MX) W/షాప్ - 64
భావన నగర్ (BVP) W/షాప్ - 73
దాహోడ్ (DHD) W/షాప్ - 187
ప్రతాప్ నగర్ (PRTN)W/షాప్, వడోధర - 45
సబర్మతి (SBI)Engg W/షాప్, అహ్మదాబాద్ - 60
సబర్మతి (SBI) సిగ్నల్ W/షాప్, అహ్మదాబాద్ - 25
హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ - 83
జాబ్ ట్రేడ్స్ :
ఈ నోటిఫికేషన్ పైన వివరించిన డివిజన్స్ లలో ఫిట్టర్స్ , వెల్డర్స్, టర్నర్స్, మెషినిస్ట్స్,కార్పెంటర్స్, పెయింటర్స్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ మరియు వైర్ మేన్స్ తదితర ట్రేడ్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 3591 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యూలేషన్ లేదా 10వ తరగతి / 10+2 ను పూర్తి చేయవలెను.
మరియు NCVT /SCVT నుండి సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులను పూర్తి చేసి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
15-24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వాలీడ్ ఈ మెయిల్ అడ్రస్ కలిగి ఉండాలని ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /PWD/అన్ని కేటగిరిల మహిళలు ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, కేవలం అభ్యర్థుల విద్యా అర్హతల మార్కుల మెరిట్ ఆధారంగా ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే అప్రేంటిస్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గవర్నమెంట్ అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం జీతాలు అందనున్నాయి.
2 Comments
Sir . 10th qualifications vunte kuda apply chyavacha
ReplyDeleteOnly 10th complete chesthe chala
ReplyDelete