ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా, తిరుపతి నగరాలలో ఉన్న ప్రముఖ ఫార్మసీ లలో ఒకటైన అపోలో ఫార్మసీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయబోతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరు /ప్రతిభ ను బట్టి ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ /కాల వ్యవధి పెంపు చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరం మరియు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మంచి స్థాయిలో జీతములు మరియు ఇతర ఆసక్తికరమైన బెనిఫిట్స్ లభించే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత గడువు తేదీలోగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూన్ 6 ,2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఫార్మాసిస్ట్ - 50
రిటైల్ ట్రైనీ అసోసియేట్ - 50
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 100 ఉద్యోగాలను తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎం. ఫార్మసీ /బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ విత్ పీసీఐ కోర్సులను పూర్తి చేయవలెను.
రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ / ఏదైనా విభాగాలలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను అని ఈ నోటిఫికేషన్ లో తెలిపారు.
ఎలా అప్లై చేయాలి..?
ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆసక్తి కరమైన జీతములు 15,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
ఈ 15,000 రూపాయలు జీతం తో పాటు మరో 3,000 రూపాయలు వరకూ ఇన్సెంటివ్స్ + ఈఎస్ఐ + ప్రొవిడెంట్ ఫండ్ (పీ. ఎఫ్ ) + బోనస్ + లీవ్ బెనిఫిట్స్ + గ్రాట్యుటీ + అవార్డ్స్ & రివార్డ్స్ + ఇన్సూరెన్స్ + ఇంక్రిమెంట్స్ + ప్రమోషన్స్ లాంటి అద్భుతమైన బెనిఫిట్స్ వంటివి ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.
NOTE :
ఈ పోస్టుల ఇంటర్వ్యూ లకు హాజరు అయేటపుడు అభ్యర్థులు తమ తమ రెస్యూమ్స్ , ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ బుక్, నాలుగు (4 )ఫోటోస్ ఒరిజినల్స్ మరియు జెరాక్స్ కాపీ లను తమ వెంట తెచ్చుకోవాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9966601867
1800-425-2422
2 Comments
Sir interview aapudu sir
ReplyDeleteInterview date aapudu sir
ReplyDelete