జనవరి 22 రైల్వే బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు జవాబులను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది.
ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే మరియు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
బిట్స్ :
1). భారతీయ ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకుడు ఏ. ఆర్. రహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంవత్సరం?
జవాబు : 2009 ( స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రం ).
2). కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే భారత కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
జవాబు : ఫిబ్రవరి 24,2019.
3). బార్డో ఛాం నృత్యంనకు ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రం?
జవాబు : అరుణాచల్ ప్రదేశ్.
4). నేషనల్ టెక్నాలజీ డే ను ఎపుడు జరుపుకుంటారు?
జవాబు : మే 11.
5). త్సాంగ్ పో నదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు?
జవాబు : బ్రహ్మపుత్ర.
6). ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ డే ఎపుడు నిర్వహిస్తారు?
జవాబు : మార్చి 3.
7). ఆయుష్ మంత్రిత్వ శాఖ పాత పేరు?
జవాబు : డిపార్టుమెంటు ఆఫ్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతీ. ( ISM & H ).
8). ఆర్టికల్ 371(G) ఏ ప్రాంతం గురించి తెలుపుతుంది?
జవాబు : మీజోరం.
9). భారత దేశంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఎక్కడ కలదు?
జవాబు : బెంగుళూరు.
10). AGMARK ( అగ్ మార్క్ ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : ఫారదాబాద్.
11).మోడరన్ పీరియడిక్ టేబుల్ ను దేని ప్రామాణికంగా తయారుచేసారు?
జవాబు : అటమిక్ నెంబర్.
12).ఎలిఫెంట్ ఫెస్టివల్ ను ఎక్కడ జరుపుకుంటారు?
జవాబు : జై పూర్.
13).భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29 దేనిని గురించి తెలుపుతుంది?
జవాబు : మైనారిటీస్.
14). ప్రముఖ బాడ్మింటన్ క్రీడా కారిణి పీ. వి. సింధుకు పద్మ భూషణ్ అవార్డు లభించిన సంవత్సరం?
జవాబు : 2020.
15). ఇంస్టాగ్రామ్ ప్రస్తుత CEO ఎవరు?
జవాబు : కెవిన్ సిస్ట్రామ్.
16). పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ ( PETA ) ను స్థాపించిన సంవత్సరం?
జవాబు : 1980
17). మిషన్ ఇంద్ర ధనుష్ అనే భారతీయ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఏ విభాగానికి చెందినది?
జవాబు : ఆరోగ్య మిషన్.
18).HTML ను ఆవిష్కరణ చేసినవారు?
జవాబు : టీమ్ బెర్నెర్స్ లీ.
19). దేశ బంధు అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : చిత్తరంజన్ దాస్.
20). PMSBY అనే పదాన్ని విస్తరించగా...?
జవాబు : ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన.
0 Comments