జనవరి 11వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్ :
జనవరి 11,2021 మధ్యాహ్నం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.
జనవరి 11, రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 బిట్స్ :
1). ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవ సంవత్సరం?
జవాబు : నవంబర్ 15, 2000.
2). సాంచి స్తూపం ఎక్కడ ఉంది?
జవాబు : బోపాల్ (మధ్యప్రదేశ్ ).
3).ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : జెనివా (స్విట్జర్లాండ్).
4).మెగ్నీసియం రసాయనిక సూచి (సింబల్ )?
జవాబు : Mg.
5). రక్తం గడ్డ కట్టడంలో సహకరించు విటమిన్?
జవాబు : విటమిన్ "K".
6). డెంగీ జ్వరం నకు కారణమయ్యే దోమ పేరు?
జవాబు : అడిస్ దోమ.
7). ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్స్ ఎక్కడ ఉంది?
జవాబు : శ్రీ నగర్ (జమ్మూ &కాశ్మీర్ ).
8). వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎపుడు జరుపుకుంటారు?
జవాబు : జూన్ 5.
9). PSLV సంక్షిప్త నామం?
జవాబు : Polar Satelite Launch Vehicle.
10). ఆస్కార్ అవార్డు 2020 లో బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన చిత్రం?
జవాబు : పారాసైట్.
11). లక్నో నగరంలో పేరు పొందిన హ్యాండ్ క్రాఫ్ట్?
జవాబు : చికాంకరి.
12). వైట్ టైగర్ పుస్తక రచయిత?
జవాబు : అరవింద్ అడిగా.
13).భారత జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి ఏ సంవత్సరంలో ఆలపించారు?
జవాబు : డిసెంబర్ 27,1911.
14).500 మరియు 1000 రూపాయల పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరం?
జవాబు : నవంబర్ 8,2016.
15).భారతదేశ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్భంద విద్య ఏ వయసు వారికీ వర్తిస్తుంది?
జవాబు : 6 - 14 సంవత్సరాలు.
0 Comments