Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Reliance Jio Jobs | రిలయన్స్ జియో లో 200 కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు

రిలయన్స్ జియో లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి APSSDC ఆధ్వర్యంలో ప్రకటన జారీ :

ప్రముఖ వాణిజ్య దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో లో ఖాళీగా ఉన్న కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.

Reliance Jio Jobs
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం అర్హతలు /ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరు మరియు ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ / ఉద్యోగ కాల పరిమితిని పెంచే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఉద్యోగాలను ఇంటి వద్దనే ఉంటూ (వర్క్ ఫ్రమ్ హోం ) చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 

తాజాగా విడుదల అయిన ఈ APSSDC నోటిఫికేషన్ నిరుద్యోగులకి చాలా గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవచ్చు.  ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలకు రిలయన్స్ జియో లాంటి సంస్థ నుండి నిరుద్యోగ అభ్యర్థుల ముందుకు వచ్చిన ఈ ప్రకటన  ఒక సువర్ణ అవకాశం గా మనం చెప్పవచ్చు. 

కావున ఏపీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అందరూ నిర్ణిత గడువు తేదీలోగా ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉత్తమం. 

ముఖ్యమైన తేదీలు : 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది   :  మే 24, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్      -     200

అర్హతలు :

ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగాలలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన యువతీ యువకులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.

NOTE :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఆండ్రాయిడ్ మొబైల్ (వెర్షన్ 6. O+) , పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన ఆధార్ కార్డ్ ,  పాన్ కార్డ్ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

విద్యా అర్హతలు లేదా ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు లభించనున్నాయి.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

8179541641

1800-425-2422

Registration Link

Website 

Reliance Jio Jobs




Post a Comment

4 Comments