బ్యాంక్ ఆఫ్ బరోడా లో సీనియర్ పొజిషన్స్ పోస్టులను ఫిక్స్డ్ టర్మ్ విధానంలో భర్తీ చేయడానికి గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా , ముంబై నుండి తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ఈ నోటిఫికెషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న హెడ్ , డిప్యూటీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎటువంటి వ్రాత పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. BOB Degree Mumbai Jobs
మంచి జీతములు లభించే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముంబై నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 15 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
హెడ్ (బిజినెస్ ఫైనాన్స్ ) - 1
హెడ్ (ఐసీ & ఎఫ్ జి ) - 1
హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్ ) - 1
డిప్యూటీ హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్ ) - 1
డిప్యూటీ హెడ్ (ఫైనాన్సియల్ అకౌంటింగ్ ) - 1
వైస్ ప్రెసిడెంట్ (బాలన్స్ షీట్ ప్లానింగ్ ) - 1
వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ ప్రొఫీటబిలిటీ ) - 1
వైస్ ప్రెసిడెంట్ (BU ప్రాఫిటబిలిటీ ) - 1
అర్హతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ (ఫైనాన్స్)/CA /CFA/CMA/ICMA కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వాలీడ్ ఈ మెయిల్ ఐడి మరియు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ను కలిగి ఉండవలెను.
వయసు :
జాబ్స్ కేటగిరీ లను అనుసరించి 32 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానములో పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /EWS/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /PWD /ఉమెన్స్ అభ్యర్థులు 100 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ / గ్రూప్ డిస్కషన్స్ / ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు .
జీతం :
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు పై వరకూ జీతం లభించనుంది.
0 Comments