గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 319 ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయనున్న ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కావున ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Vizag Steel Plant Vacancies
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది : జూన్ 26 , 2021
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూలై 17, 2021
ఫీజు పేమెంట్స్ కు ప్రారంభం తేది : జూన్ 26, 2021
ఫీజు పేమెంట్స్ కు చివరి తేది : జూలై 19, 2021
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహణ తేది : ఆగష్టు 8, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఫిట్టర్ - 75
టర్నర్ - 10
మెషినిస్ట్ - 20
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్ ) - 40
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్ (MMTM) - 20
ఎలక్ట్రీషియన్ - 60
కార్పెంటర్ - 20
మెకానిక్ (R & AC ) - 14
మెకానిక్ డీజిల్ - 30
కంప్యూటర్ ఆపరేటర్ &ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 30
మొత్తం పోస్టులు :
319 ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సులను పూర్తి చేసి , NCVT సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
అన్ రిజర్వ్డ్ /ఓబీసీ / EWS అభ్యర్థులు 200 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /PWD అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్ష విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహించనున్నారు.ఎటువంటి నెగటివ్ మార్కుల విధానం అమలులో లేదు.
స్టై ఫండ్ :
కేటగిరీ ల వారీగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆసక్తి కరమైన స్టైఫండ్ లభించనుంది.
0 Comments