గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సంయుక్త ఆధ్వర్యంలో ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా జారీ అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ కాబోయే ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాలకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అభ్యర్థులు అందరూ అర్హులే అని ప్రకటనలో తెలిపారు.
కావున ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు కూడా ఈ రైల్వే మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్, కోయంబెడు, చెన్నై పరిధిలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ /ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 7 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
జాయింట్ జనరల్ మేనేజర్ (BIM) - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 2
డిప్యూటీ మేనేజర్ (ప్లానింగ్ ) - 2
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు , గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ /యూనివర్సిటీ ల నుండి మెకానికల్ /సివిల్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులు మరియు ఛార్టర్డ్ అకౌంట్స్ (CA) కోర్సులను పూర్తి చేయవలెను.కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
35 నుండి 43 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం మరియు సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు మరియు ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామాకు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
డిమాండ్ డ్రాఫ్ట్ (DD) విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.
అన్ రిజర్వ్డ్ / ఇతర కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానము :
ఇంటర్వ్యూ /మెడికల్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఉద్యోగాల కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70,000 రూపాయలు జీతం నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
Joint General Manager (HR),
Chennai Metro Rail Limited,
CMRL Depot, Admin Building,
Poonamallee High Road,
Koyambedu, Chennai - 600107.
ఈ మెయిల్ అడ్రస్ :
senthil.s@cmrl.in
0 Comments