హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 2,60,000 రూపాయలు వరకూ.. ఇరు తెలుగు రాష్ట్రాల వారు వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన , భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెందిన అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జూలై 4 , 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 19,2021
హార్డ్ కాపీ అప్లికేషన్స్ చేరుటకు చివరి తేది : జూలై 27,2021
విభాగాల వారీగా ఖాళీలు :
జనరల్ మేనేజర్ (HR) - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ ( న్యూ ప్రాజెక్ట్ ) - 3
మెడికల్ ఆఫీసర్ - 2
అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ ) - 3
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్ ) - 12
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ ) - 9
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ) - 3
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ ) - 3
మేనేజ్ మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్) - 2
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఆప్టిక్స్ ) - 1
మేనేజ్ మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్మెంట్ ) - 1
మేనేజ్ మెంట్ ట్రైనీ ( ఫైనాన్స్ ) - 3
మేనేజ్ మెంట్ ట్రైనీ (హెచ్. ఆర్ ) - 3
మొత్తం ఉద్యోగాలు :
46 పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జక్ట్స్ లలో డిగ్రీ/పీజీ /పీజీ డిప్లొమా /ఎంబీఏ /ఎంబీబీఎస్ /ఎంఎస్/ఎండీ/గ్రాడ్యుయేషన్ ఇన్ లా / తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
27 - 55 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆయా కేటగిరీ ల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి.
ఆన్లైన్ లో అప్లికేషన్ ఫారం ను నింపిన తరువాత, ఆన్లైన్ అప్లికేషన్ ను సంబంధిత విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలతో చేర్చి క్రింది అడ్రస్ కు రిజిస్టర్ /స్పీడ్ పోస్ట్ చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజును చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /PWD అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ ల విధానం ద్వారా నియామకాలను చేపట్టనున్నారు.
మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 2,60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
SM, C- HR ( TA & CP) ,
Bharat Dynamics Ltd,
Corporate Office, Plot No : 38-39,
TSFC Building(Near ICICI Towers),
Financial District,
Gachibowli, Hyderabad,
Telangana - 500032.
0 Comments