Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO 54000 Salary Jobs in telugu | DRDO లో 54000 వరకు జీతం తో ఉద్యోగాలు

 పరీక్ష లేదు, DRDO లో ఉద్యోగాలు, నెలకు జీతం 54,000 రూపాయలు వరకూ జీతం.

ఎటువంటి పరీక్షలు లేకుండా, DRDO లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు చెందిన  డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ లేబర్యాటరీ (DRL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికెషన్ తాజాగా విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు లేకుండా,కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో మంచి వేతనాలు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా  DRDO, DRL తేజ్ పూర్, అస్సాం రాష్ట్రంలో ఖాళీగా వున్న రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పరీక్షలు లేకపోవడం, భారీ స్థాయిలో జీతములు లభించడం ఈ పోస్టుల ప్రత్యేకత.. కావున అర్హతలు గల అభ్యర్థులు మీ మీ వాలీడ్ ఈ - మెయిల్ ద్వారా ఈ ఉద్యోగాలకు నిర్ణిత గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది గా మనం చెప్పుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఈ - మెయిల్ దరఖాస్తులకు చివరి తేది   :   జూలై 31, 2021

ఇంటర్వ్యూ నిర్వహణ తేది                         :  త్వరలో..

విభాగాల వారీగా ఖాళీలు  :

రీసెర్చ్ అసోసియేట్స్                          -          3

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)            -          2

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)            -          2

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విద్యా అర్హతలను కలిగి ఉండవలెను.

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు జూవలాజి /ఎంటోమాలజీ /హార్టికల్చర్ /ఫుడ్ సైన్స్ &టెక్నాలజీ /మైక్రో బయాలజీ /బయో టెక్నాలజీ /ఎన్విరాన్మెంటల్ సైన్స్ /లైఫ్ సైన్స్ విభాగాలలో పీహెచ్. డీ (Ph. D) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ క్వాలిఫికేషన్ తో టెక్స్ట్ టైల్స్ ఇంజనీరింగ్ లో ఎం. టెక్ /ఎంఈ కోర్సు (లేదా ) ఎం. ఎస్సీ (బయో టెక్నాలజీ ) లేదా, ఎం. ఫార్మసీ కోర్సులను పూర్తి చేయవలెను.

జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే  నెట్ క్వాలిఫికేషన్ తో  బోటనీ /మైక్రో బయో లజీ /బయో టెక్నాలజీ /ఎన్విరాన్ మెంటల్ సైన్స్ /లైఫ్ సైన్స్ లలో ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

విభాగాలను అనుసరించి  28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ  అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ద్వారా  ఈ -మెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ /ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ విధానము ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ  జీతంగా  రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు     31,000 రూపాయలు మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు  54,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ - మెయిల్ అడ్రస్ :

drlteztc@gmail.com

Website 

Notification 

Post a Comment

0 Comments