గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ECIL తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ECIL, విశాఖపట్నం లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.
భారీ స్థాయిలో మంచి జీతములు లభించే ఈ ఒప్పంద ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ECIL రీజినల్ ఆఫీస్, విశాఖపట్నం లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ప్రాజెక్ట్ ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాలకు వేరు వేరు తేదీలలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎటువంటి వ్రాత పరీక్షలు మరియు ఆన్లైన్ టెస్టుల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. కావున ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఇంటర్వ్యూ లకు హాజరు అవ్వడం మంచిదని మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ ల నిర్వహణ తేదీలు : జూన్ 15 & 16 , 2021
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం : 9 AM to 11 AM.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ECIL రీజినల్ ఆఫీస్ , H. No : 47-09-28, ముకుంద సువాస్ అపార్ట్ మెంట్స్, 3rd లేన్, ద్వారకా నగర్ , విశాఖపట్నం - 530016.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (ECE/EEE/EIE) - 11
ప్రాజెక్ట్ ఇంజినీర్స్ (మెకానికల్ ) - 1
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (ECE/EEE/EIE) - 7
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (మెకానికల్ ) - 1
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఇంటర్వ్యూల నిర్వహణ తేదీలు :
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ - జూన్ 15 , 2021
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ - జూన్ 16, 2021
అర్హతలు :
విభాగాలను అనుసరించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ /యూనివర్సిటీ ల నుండి ECE /EEE/EIE/మెకానికల్ విభాగాలలో 60% మార్కులతో మొదటి శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
విభాగాలను అనుసరించి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ /యూనివర్సిటీ ల నుండి ECE /EEE/EIE /మెకానికల్ విభాగాలలో 60% మార్కులతో మొదటి శ్రేణిలో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు ఉండవలెను.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ విధానములలో ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాల వారీగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 55, 000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతం తో పాటు సుమారుగా రెండు లక్షల వరకూ మెడికల్ ఇన్సూరెన్స్ మరియు 7000 రూపాయలు వరకూ ఇతర అలోవెన్స్ సౌకర్యాలు కూడా పోస్ట్ ఎంపిక ప్రాతిపదికన కల్పించబడతాయి అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఫోన్ నెంబర్ :
0891- 2755836
Email Address :
hrrect@ecil.co.in
0 Comments