బ్యాంక్ జాబ్స్ బోనంజా, 10,636 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి IBPS నుండి మెగా నోటిఫికేషన్ విడుదల, ఇరు తెలుగు రాష్ట్రాల గ్రామీణ బ్యాంక్ ల్లో భారీగా ఖాళీలు ,పరీక్షలు కూడా తెలుగులోనే.. సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు,, ఇప్పుడే అప్లై చేసుకొండి..Don't Miss ".
బ్యాంక్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు IBPS నుండి భారీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
భారత దేశ వ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంక్స్ (RRB's)లో ఖాళీగా ఉన్న సుమారు 10,368 ఆఫీసర్ (స్కేల్ - I, II & III) మరియు ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీ పర్పస్ ) పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ ను తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసినది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో (రీజినల్ రూరల్ బ్యాంక్స్ ) కూడా అన్ని కేటగిరీ లలో కలిపి వేల సంఖ్యలో బ్యాంక్ పోస్టులు భర్తీ కానున్నాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ విధానములలో భర్తీ కాబోయే ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
భారీ స్థాయిలో వేతనములు లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు నని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఐబీపీఎస్ నుండి భర్తీ చేయబోతున్న ఈ 10,368 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. కావున, అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది గా మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & పేమెంట్స్ ప్రారంభం తేది : జూన్ 8, 2021
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & పేమెంట్స్ కు చివరి తేది : జూన్ 28,2021
అప్లికేషన్ ఎడిటింగ్ & ప్రింటింగ్కు చివరి తేది : జూన్ 28, 2021
ప్రీ -ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : జూలై 9,2021
ప్రీ - ఎగ్జామ్స్ ట్రైనింగ్ తేది : జూలై 19 - 25 , 2021
ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష తేది : జూలై /ఆగష్టు, 2021
ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల తేది : సెప్టెంబర్, 2021
ఆన్లైన్ మెయిన్స్ /సింగిల్ పరీక్ష తేది : సెప్టెంబర్/అక్టోబర్, 2021
మెయిన్స్ పరీక్ష ఫలితాల తేది : అక్టోబర్, 2021
ఇంటర్వ్యూల నిర్వహణ తేది : అక్టోబర్ /నవంబర్, 2021
ప్రొవిజనల్ అలాట్ మెంట్ డిక్లరేషన్ తేది : జనవరి, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీ పర్పస్) - 5134
ఆఫీసర్ స్కేల్ -I (అసిస్టెంట్ మేనేజర్స్ ) - 3922
ఆఫీసర్ స్కేల్ -II(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్స్ ) - 906
ఆఫీసర్ స్కేల్ -II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ) - 59
ఆఫీసర్ స్కేల్ -II (ఛార్టర్డ్ అకౌంటెంట్ ) - 32
ఆఫీసర్ స్కేల్ -II (లా ఆఫీసర్స్ ) - 27
ఆఫీసర్ స్కేల్ -II(ట్రేజరి మేనేజర్స్ ) - 10
ఆఫీసర్ స్కేల్ -II(మార్కెటింగ్ ఆఫీసర్స్ ) - 43
ఆఫీసర్ స్కేల్ -II (అగ్రికల్చర్ ఆఫీసర్స్ ) - 25
ఆఫీసర్ స్కేల్ - III - 210
మొత్తం ఉద్యోగాలు :
ఐబీపీఎస్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా 10,368 బ్యాంక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఉద్యోగాల విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ , లోకల్ లాంగ్వేజ్ పై ప్రొఫీషియన్సీ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలుకు మరియు ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఆఫీసర్ స్కేల్ -III (సీనియర్ మేనేజర్ )ఉద్యోగాలకు 21-40 సంవత్సరాలు , ఆఫీసర్ స్కేల్ -II (మేనేజర్ ) పోస్టులకు 21-32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ -I (అసిస్టెంట్ మేనేజర్ )ఉద్యోగాలకు 18-30 సంవత్సరాలు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్ ) పోస్టులకు 18-28 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదని ఈ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /PWD అభ్యర్థులు 175రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారుగా 45,000 రూపాయలు పైన లభించనుంది.
ఈ జీతంతో పాటు DA + HRA +స్పెషల్ అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
NOTE :
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తెలుగు మీడియం లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ వ్రాసుకోవచ్చు.
పరీక్ష కేంద్రముల ఎంపిక :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు వారి వారి సొంత జిల్లాలలోనే పరీక్షలు వ్రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పరీక్ష కేంద్ర నగరముల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ :
అనంతపురం , చీరాల , గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, కడప, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ :
హైదరాబాద్, ఖమ్మం , కరీంనగర్, వరంగల్.
www.ibps.in
Apply Online
0 Comments