ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో నిర్వహించనున్న నూతన ప్రాజెక్ట్ కు గాను వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయినది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 31/3/2022 వరకూ కాంట్రాక్టు బేసిస్ లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జూలై 3 , 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : మధ్యాహ్నం 1 PM
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ఛాంబర్ ఆఫ్ ది అసోసియేట్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్,రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ , తిరుపతి.
విభాగాల వారీగా ఖాళీలు :
బిజినెస్ మేనేజర్ - 1
అసిస్టెంట్ మేనేజర్ - 1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ - 1
ఆఫీస్ అసిస్టెంట్ - 1
అర్హతలు :
విభాగాలను అనుసరించి సంబంధిత విభాగాలలో గ్రాడ్యుయేషన్ /బీ. కామ్ /బీబీఏ / ఎంఎస్సీ (అగ్రికల్చర్ ) ఎంబీఏ/ఎంసీఏ/బీటెక్ /ఎంటెక్ /పీజీడీఎం కోర్సులను పూర్తి చేయవలెను.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టుల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధన లేదు.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
NOTE :
తిరుపతి లో నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ బయో డేటా , ఒరిజినల్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మరియు ఇతర విద్యా సంబంధిత సర్టిఫికెట్స్, వాటి నకళ్లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
0 Comments