కరెంట్ అఫైర్స్ - 2021, ఇంటర్నేషనల్ హాట్ టాపిక్, ఆఫ్ఘానిస్తాన్ - తాలిబాన్ల పాలన అంశంపై పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన బిట్స్
అంతర్జాతీయంగా ఇపుడు ఎక్కడ చూసిన..ఏ నోట విన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం గురించే చర్చ నడుస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తాలిబాన్ల పాలన మొదలు కావడంతో, ఆ దేశంలో ప్రజల జీవన పరిస్థితులు మరియు అక్కడ నెలకొని ఉన్న ఉద్రిక్తతలు ఇపుడు ఇంటర్నేషనల్ హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా జరుగుతున్న ఈ అంశంపై రాబోయే రోజుల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలలో రావడానికి వీలుండే ముఖ్యమైన బిట్స్ ను మనం ఇపుడు తెలుసుకుందాం.
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ - 2021 IMP BITS :
1). ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క అధికారిక నామం పేరు?
జవాబు : ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్.
2).ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క కరెన్సీ ఏది ?
జవాబు : ఆఫ్ఘన్ ఆఫ్ఘని.
3). ఆఫ్ఘనిస్తాన్ దేశమును తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో తాజాగా ఆఫ్ఘన్ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన ప్రస్తుత ఆఫ్ఘన్ దేశ అధ్యక్షుడు పేరు?
జవాబు : అస్రఫ్ ఘని.
4). ఏ ఘటన జరిగి 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న కారణంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న తమ సైనిక బలగాలను అమెరికా దేశం వెనుకకు ఉపసంహారించుకుంది?
జవాబు : వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై 2001 సెప్టెంబర్ 11 న జరిగిన దాడి.
5). తాలిబన్ అనగా అరబ్బీ భాషలో అర్ధం..?
జవాబు : ధర్మ జ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థి.
6). తాలిబన్ల సంఘాన్ని స్థాపించినది..?
జవాబు : మొహమ్మద్ ఒమార్.
7). తాలిబన్ల ముఖ్య పట్టణం ఏది..?
జవాబు : కాందాహర్.
8). ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి అమెరికా దళాలను ఉపసంహరించనున్నట్లు ఏప్రిల్ 14, 2021 న ప్రకటించిన అమెరికా దేశం నూతన అధ్యక్షుడు ఎవరు?
జవాబు : జో బీడైన్.
9). ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబుల్ నగరానికి నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన "లాలందర్ (శతూత్ )" ఆనకట్ట నిర్మాణానికి సంబందించిన అవగాహన ఒప్పందపత్రం భారత్ - ఆఫ్ఘన్ దేశాల మధ్య ఏ తేదీన కుదిరింది..?
జవాబు : ఫిబ్రవరి 9, 2021.
10). ఆఫ్ఘనిస్తాన్ లోని ఏ ప్రాంతం నుండి దౌత్యవేత్తలను భారత్ ఇటీవల ఉపసంహారించుకుంది?
జవాబు : కాందహార్.
11). పాకిస్తాన్ దేశంతో సంబంధం లేకుండా వాణిజ్యం చేసుకోవడానికి ఇరాన్ లోని నూతనంగా నిర్మించిన ఏ నౌకశ్రయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు ఇటీవల ఎగుమతులు ఆరంభం అయ్యాయి..?
జవాబు : చాబహార్.
12). ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆసియా లో ఏ ప్రాంతమునకు చెందినది?
జవాబు : దక్షిణ మధ్య ఆసియా.
ముఖ్యమైన గమనిక ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ మరియు కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు అభ్యర్థులు మన telugucompetitive.com వెబ్సైటు ను వీక్షించగలరు.
పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
తెలంగాణ లో ఉద్యోగాలు Clik Here
0 Comments