గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజస్, మహరత్న హోదా పొందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో
పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
మంచి స్థాయిలో స్టై ఫండ్ లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు.
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 20, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 18, 2021
వ్రాత పరీక్ష /CBT నిర్వహణ తేది : అక్టోబర్, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్లొమా ట్రైనీ ( ఎలక్ట్రికల్ ) - 23
డిప్లొమా ట్రైనీ ( సివిల్ ) - 3
మొత్తం పోస్టులు :
మొత్తం 26 పోస్టులను తాజాగా జారీ అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో ఫుల్ టైం మూడు (3) సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
27 సంవత్సరాలు వయసు ఉన్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు, 30 సంవత్సరాలు వయసుగల ఓబీసీ అభ్యర్థులు మరియు 32సంవత్సరాలు వయసు గల ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను .
ఎస్సీ / ఎస్టీ / దివ్యంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టైఫండ్ / జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో 27, 500 రూపాయలు స్టై ఫండ్ మరియు ఈ పోస్టులు రెగ్యులర్ అయిన తరువాత 1,17,500 రూపాయలు వరకూ జీతం అందనుంది. ఈ జీతంతో పాటు PF, HRA మరియు గ్రాట్యుటీ లాంటి మంచి బెనిఫిట్స్ అభ్యర్థులకు లభించనున్నాయి.
పరీక్ష లేదు, ఏపీ అంగన్వాడీ లో ప్రభుత్వ ఉద్యోగాలు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
తెలంగాణ లో ఉద్యోగాలు Clik Here
0 Comments