కేవలం 7వ తరగతి అర్హతలతో ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రకటనను కడప జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ తాజాగా జారీ చేసినది.
ఏపీ స్టేట్, కడప జిల్లాలో ఐసీడిఎస్ (ICDS) ప్రాజెక్ట్ లో భాగంగా అంగన్వాడీ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీని ఈ నోటిఫికేషన్ ద్వారా చేపట్టనున్నారు.
ముఖ్యమైన అంశాలు :
1). అతి తక్కువ విద్యా అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు.
2). పరీక్ష , ఇంటర్వ్యూలు లేవు.
3). సొంత ఊరిలోనే ఉద్యోగం.
ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల కడప జిల్లాకు చెందిన స్థానిక వివహిత మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. AP Anganwadi Jobs 2021 Telugu
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, అప్లై విధానం, ఎంపిక విధానం తదితర ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఆగష్టు 31, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
అంగన్వాడీ కార్యకర్త - 50
అంగన్వాడీ సహాయకురాలు - 225
మినీ అంగన్వాడీ కార్యకర్తల - 13
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా 288 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి అర్హతలు మరియు అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 7వ తరగతి అర్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థుల బయో - డేటా మరియు అన్ని ధ్రువీకరణ పత్రాలను అటెస్ట్ చేసి ఈ క్రింది చిరునామాకు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలా వారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన జీతం లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
శిశు అభివృద్ధి పధక అధికారి వారి కార్యాలయం,
ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ , కడప జిల్లా.
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,20,000
ఫ్లాష్ న్యూస్, రైల్వే ఎన్టీపీసీ పరీక్షలపై అతి ముఖ్యమైన అప్డేట్స్
0 Comments