గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (CABS) బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ వెలువడినది .
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విభాగాల వారీగా ఖాళీలు,
అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది :
ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు :
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ - 2
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 5
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 9
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 1
మెకానికల్ ఇంజనీరింగ్ - 3
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 20 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాలలో బీఈ / బీ. టెక్ / ఎంఈ /ఎంటెక్ కోర్సులను పూర్తి చేసి, గేట్ వాలీడ్ స్కోర్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
28 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు వెబ్ ఆధారిత ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31, 000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు లభించనున్నాయి.
E-mail Address
jrf.rectt@cabs.drdo.in
0 Comments