పదవ తరగతి మరియు ఇంటర్ అర్హతలతో పోస్ట్ ఆఫీస్ (పోస్టల్ ) ఉద్యోగాలు, జీతం 81,000 రూపాయలు వరకూ ఉంటుంది.
డిపార్టుమెంటు ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన తెలంగాణ పోస్టల్ సర్కిల్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టల్ ఉద్యోగాలను స్పోర్ట్స్ కొటా లో భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1. తక్కువ విద్యా అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2. ఎటువంటి పరీక్షలు లేవు.
3. భారీస్థాయిలో వేతనాలు.
అతి తక్కువ విద్యా అర్హతలతో మరియు ఎటువంటి పరీక్షలు లేకుండా, భారీ స్థాయిలో జీతములు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. TS Postal 55 Jobs Recruitment 2021 Telugu
మరియు మంచి వేతనాలు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హులే అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పోస్టల్ సర్కిల్,హైదరాబాద్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు, ఉద్యోగాల కేటగిరీలు, విద్యా అర్హతలు, వయసు, ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 17, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 24, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్టల్ అసిస్టెంట్ - 11
సార్టింగ్ అసిస్టెంట్ - 8
పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్ - 26
ఎంటీఎస్ (MTS) - 10
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఉద్యోగాల విభాగాలను అనుసరించి 10వ తరగతి మరియు ఇంటర్ విద్యా అర్హతలుగా కలిగి, లోకల్ లాంగ్వేజ్ పై పట్టు ఉండి, సంబంధిత క్రీడలలో ప్రావీణ్యం కలిగి ఉండి మరియు అంతర్జాతీయ, జాతీయ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతలు మరియు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 రూపాయలు నుండి 81,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments