డిగ్రీ అర్హతతో 151 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 50,000 రూపాయలు పైన , అసలు మిస్ కావద్దు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో ఖాళీగా ఉన్న 151 డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసినది.
భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. UPSC Jobs Recruitment Telugu 2021
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 2 , 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్ కు చివరి తేది : సెప్టెంబర్ 3, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటీ డైరెక్టర్స్ - 151
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ / EWS కేటగిరీ అభ్యర్థులు 25 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మహిళలు / ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 రూపాయలు పైన జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే తెలుగు రాష్ట్రముల కు చెందిన అభ్యర్థులు విశాఖపట్నం నగరమును పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.
0 Comments