పరీక్ష & ఇంటర్వ్యూ లు లేవు. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 2226 అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన భారీ నోటిఫికేషన్ జబల్ పూర్ నుండి తాజాగా విడుదల అయినది.
వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్ప్రెంటీస్ ప్రకటన - ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే అప్ప్రెంటీస్ ఉద్యోగాలు
2). భారీస్థాయిలో పోస్టుల భర్తీ
3). పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేవు.
4). భారతీయ రైల్వే నుండి ఇవ్వబడే ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్స్ భవిష్యత్తు రైల్వే ఉద్యోగాల నియామకాలకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా కేవలం విద్యా అర్హతలను అనుసరించి భర్తీ చేయబోయే No Exam Railway 2226 Vacancies Telugu
ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హులే అని ప్రకటనలో తెలిపారు.
తాజాగా వచ్చిన ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : అక్టోబర్ 11, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 10,2021
ప్రాంతముల వారీగా ఖాళీలు :
జబల్ పూర్ - 570
భోపాల్ - 648
కోటా - 663
కోటా వర్క్ షాప్ - 160
భోపాల్ వర్క్ షాప్ - 165
HQ/ జబల్ పూర్ - 020
విభాగాల వారీగా ఉద్యోగాలు :
డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వైర్ మాన్, మాసన్, కార్పెంటర్, పెయింటర్, గార్డనర్, ఫ్లోరిస్ట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, స్టేనోగ్రాఫర్(హిందీ & ఇంగ్లీష్ ), హోటల్ క్లర్క్, హౌస్ కీపర్, హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్ తదితర విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2226 అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి /సమాన విద్యా అర్హతలను కలిగి ఉండి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మరియు ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ మరియు విద్యా అర్హతల మార్కుల ఆధారంగా ఈ రైల్వే అప్ప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గవర్నమెంట్ అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం ఆసక్తికరమైన స్టై ఫండ్ లభించనుంది.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్ : 8179492829
0 Comments