BSF లో 72 ఉద్యోగాలు, జీతం 92,300
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ -సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఇవి గ్రూప్ -సీ (నాన్ గేజిటెడ్ -నాన్ మినిస్ట్రీయల్ ) విభాగానికి చెందిన పోస్టులు.
3).ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
భారీస్థాయిలో జీతములు లభించే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటనలో తెలిపారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 45 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
ASI (DM-Gde -III) - 1
HC(కార్పెంటర్ ) - 2
HC(ప్లంబర్ ) - 2
కానిస్టేబుల్ (సివెర్ మాన్ ) - 2
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్ ) - 24
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్ ) - 28
కానిస్టేబుల్ (లైన్ మాన్ ) - 11
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 72 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించి ఉండవలెను అనీ ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
25 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష /మెడికల్ టెస్టుల నిర్వహణ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 21,700 రూపాయలు నుండి 92,300 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.
0 Comments