ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవ్వుతూ, రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికి సంబంధించి రెండు ముఖ్యమైన ప్రకటనలను తాజాగా భారతీయ రైల్వే బోర్డు విడుదల చేసింది.
అప్డేట్ - 1 :
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ద్వారా రైల్వే పోస్టుల భర్తీ :
భారతీయ రైల్వే బోర్డు కు సంబంధించిన లెవెల్ -7, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ (SSE) పోస్టులను ఇప్పటి వరకూ ప్రమోషన్స్ రూపంలో భర్తీ చేస్తూ వస్తుంది.
తాజాగా లెవెల్ -7 కు సంబంధించిన ఈ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ (SSE) పోస్టులను ఇకపై భవిష్యత్తులో రాబోయే రోజుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు RRB ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేయడం జరిగింది.
భారతీయ రైల్వే బోర్డు కు సంబంధించిన ఈ లెవెల్ -7 సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ (SSE), కెమిస్ట్ & మెటలార్జిస్ట్ (CMS) మరియు CDMS పోస్టులను ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు.
అప్డేట్ - 2 :
సికింద్రాబాద్ రైల్వే బోర్డు వెబ్సైట్ మార్పు :
దక్షిణమధ్య రైల్వే లో భర్తీ చేసే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన గమనిక.
ఇప్పటి వరకూ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సికింద్రాబాద్ కు చెందిన రైల్వే పరీక్షల భర్తీకి సంబందించిన తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు చూస్తున్న rrbsecunderabad.nic.in అనే వెబ్సైటు ఇకపై పని చేయదు అనీ సికింద్రాబాద్ రైల్వే బోర్డు నుండి ఒక అప్డేట్ వచ్చింది.
ఇకపై సికింద్రాబాద్ రైల్వే బోర్డు కు చెందిన డోమైన్ పేరును మారుస్తున్నట్లు ఈ ప్రకటనలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు తెలిపింది.
ఇకపై rrbsecunderabad.nic.in వెబ్సైటు rrbsecunderabad.gov.in గా మారుతుందని, భారతీయ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరూ ఈ ముఖ్యమైన విషయాన్నీ గమనించవలసిందిగా సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు ఈ ప్రకటనలో తెలిపింది.
Old Domain Name : rrbsecunderabad.nic.in
New Domain Name : rrbsecunderabad.gov.in
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments