జీతం 35,000 రూపాయలు వరకూ,,900 ఉద్యోగాలతో మెగా జాబ్ డ్రైవ్ , APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా లోని అమలాపురం నగరంలో భారీ సంఖ్యలో 900కు పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహించి, తద్వారా పలు ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది.
ముఖ్యంశాలు :
1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ APSSDC ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
2). గౌరవ స్థాయిలో జీతములు మరియు ఇతర సౌకర్యాలు లభించనున్నాయి.
3).ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
4). పదవ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాలు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య నగరలైనా విశాఖపట్నం, నెల్లూరు, తడ, ఈస్ట్ గోదావరి జిల్లా, విజయవాడ, రాజమండ్రి, శ్రీ సిటీ - నెల్లూరు, వెస్ట్ గోదావరి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం మొదలైన ప్రాంతాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
AP Job Mela 35,000 Salary
ఏపీ స్టేట్ అమలాపురం లో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది : డిసెంబర్ 29,2021
జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
మిరియం డిగ్రీ కాలేజీ, బ్లాక్ బ్రిడ్జి దగ్గర, అమలాపురం,ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్.
జాబ్ డ్రైవ్ లో పాల్గొనే సంస్థలు :
ఇన్ఫోటెక్
హీరో మోటో కార్ప్
ముతూట్ ఫైనాన్స్
మీషో
అపోలో ఫార్మసీ
ఫ్లెక్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్
క్యూస్ కార్ప్ (ఆక్సిస్ బ్యాంక్ )
ఇన్నోవ్ సోర్స్ (SBI కార్డ్స్ )
భారత్ FIH లిమిటెడ్
వరుణ్ మోటార్స్
కుటుంబ్ కేర్ (ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ )
ఎలీట్ ఏపీ బిసినెస్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్
STS వెల్త్ మేనేజ్ మెంట్
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్
మెడ్ ప్లస్
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
బైజుస్
విభాగాల వారీగా ఖాళీలు :
కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ - 50
టెక్నీషియన్ - 100
ప్రోబేషనరీ ఆఫీసర్స్ - 10
జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ - 20
ఇంటర్న్ షిప్ - 10
సేల్స్ ఆఫీసర్స్ - 50
ఫార్మసీస్ట్ /ఫార్మసీ అసిస్టెంట్ /ట్రైనీ - 60
అసెంబ్లీ ఆపరేటర్ - 100
రిలేషన్ షిప్ ఆఫీసర్స్ - 40
బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్etc - 100
MIS ఎగ్జిక్యూటివ్ /టీమ్ లీడర్ etc - 48
అసెంబ్లీ ఆపరేటర్ - 100
ఎవల్యూటర్స్ - 20
ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్/ప్రమోటర్స్ - 50
మేనేజ్ మెంట్ ట్రైనీ - 15
BDE/డెవలప్ మెంట్ ఆఫీసర్స్ - 35
ఫార్మా ట్రైనీ - 60
సేల్స్ ఎగ్జిక్యూటివ్ - 25
బ్రాంచ్ ప్రమోటర్స్ - 20
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 900కు పైగా ఉద్యోగాలను ఈ మెగా జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటిఐ /డిగ్రీ /పీజీ /బీ. టెక్ /బీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కావచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో పొందుపరిచారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కొన్ని విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ జీతంతో పాటుగా పీ. ఎఫ్+ బోనస్ +ఈఎస్ఐ+ఇంక్రిమెంట్స్+లీవ్ బెనిఫిట్స్ +గ్రాట్యుటీ +అవార్డ్స్ +రివార్డ్స్ +ప్రమోషన్స్ తదితర విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
Note :
ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కాబోయే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లను ధరించి, తమ తమ రెస్యూమ్స్ + ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ జీరాక్స్ కాపీ లు మరియు ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను అభ్యర్థులు అందరూ తప్పకుండా పాటించాలని ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9581422339, 9949981675,
9988853335
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments