Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSFC Jobs 2022 Telugu : జీతం 87,130 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, తెలంగాణ డివిజన్ ఆఫీస్, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

జీతం 87,130 రూపాయలు వరకూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు, ఇపుడే అప్లై చేసుకోండి. 

APSFC Jobs 2022 Telugu

ముఖ్యాంశాలు: 

1). ఈ ఉద్యోగాలను ఫుల్ టైమ్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). ఇవి ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగాలు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడానికి ఆసక్తి చూపే అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ఈ ప్రకటనలో తెలిపారు.

కావున, ఈ పోస్టులకు ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, హైదరాబాద్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ ప్రకటనలో పొందుపరిచిన అంశాలు అన్నిటిని సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   డిసెంబర్ 24, 2021

ఫీజు పేమెంట్స్ కు చివరి తేది                :   జనవరి 19, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :   జనవరి 19, 2022

ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది                    :    ఫిబ్రవరి, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్స్ )           -       6

అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ )            -      7

అసిస్టెంట్ మేనేజర్ (లా )                       -      7

మొత్తం పోస్టులు  :

మొత్తం 20 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది విద్య అర్హతలను కలిగి ఉండవలెను.

గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 60% మార్కులతో సీఏ (ఇంటర్ )/సీఎంఏ(ఇంటర్ )/ఎంబీఏ /పీజీడీఎం/పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కామర్స్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కెమికల్ /ఎలక్ట్రికల్ /సివిల్ /మెకానికల్ విభాగాలలో 60% మార్కులతో మొదటి శ్రేణిలో బీ. టెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

60% మార్కులతో లా విభాగంలో బాచిలర్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అసిస్టెంట్ మేనేజర్ (లా ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పై విద్యా అర్హతలతో పాటుగా, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

21 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1003 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 590 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 52,713 రూపాయలు నుండి 87,130 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Apply Link

Notification

వైజాగ్ లో డిసెంబర్ 27 జాబ్ మేళా Click Here

Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here


Post a Comment

0 Comments