Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

CTET Update 2021 : CTET(సీటెట్)- 2021 పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల

 ఫ్లాష్ న్యూస్, ఇపుడే ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి:

కేంద్రియ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Central Teacher Eligibility Test) - 2021 పరీక్షలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా విడుదల చేసినది.

CTET Update 2021

సీటెట్ - 2021 పరీక్షలను రెండు ఫేజులలో నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డు లను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లు సీబీఎస్ఈ బోర్డు ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (సీటెట్ ) కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలిపింది.

సీటెట్ - 2021 పరీక్షలు - ముఖ్యమైన తేదీలు  :

సీటెట్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షల(సీబీటీ)నిర్వహణ తేదీలు  : డిసెంబర్ 16,2021 - జనవరి 13, 2022.

మొదటి ఫేజ్ సీటెట్ - 2021 సీబీటీ పరీక్షల నిర్వహణ తేదీలు :  డిసెంబర్ 16,2021 - డిసెంబర్ 31,2021.

రెండవ ఫేజ్ సీటెట్ - 2021 సీబీటీ పరీక్షల నిర్వహణ తేదీలు : జనవరి 1, 2022   -  జనవరి 13, 2022.

సీటెట్ - 2021 అడ్మిట్ కార్డ్స్ - విడుదల తేదీలు  :

సీటెట్ - 2021 మొదటి ఫేజ్ పరీక్షలకు సంబంధించిన ఈ - అడ్మిట్ కార్డ్స్ ను పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచామని, రెండవ ఫేజ్ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు వారికీ కేటాయించబడిన పరీక్ష  నిర్వహణ తేదీలకు రెండు రోజుల ముందుగా ఈ - అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని సీబీఎస్ఈ బోర్డు ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది. CTET Update 2021

సీటెట్ - 2021 పరీక్షలకు అప్లై చేసుకుని, అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు తిరిగి మరలా ఫోటో మరియు సిగ్నేచర్స్ ను అప్లోడ్ చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ 13,2021 ఒక్క రోజు మాత్రమే మోడీఫీకేషన్ లింక్ ను వెబ్సైటు లో పొందుపరచనున్నట్లు బోర్డు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో  సీటెట్ - 2021 పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Admit cards Download Link

తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here

8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here

Post a Comment

0 Comments