Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NBCC Jobs Recruitment Telugu 2021 : హౌసింగ్ అండ్ అర్బన్ 1,60,000 వరకు జీతం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కు చెందిన సంస్థ NBCC(ఇండియా)లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

పరీక్ష లేదు, NBCC (ఇండియా) లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,60,000 రూపాయలు వరకూ, వెంటనే అప్లై చేసుకోండి.

NBCC Jobs Recruitment Telugu 2021

ముఖ్యంశాలు    :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). వీటిని రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

3). భారీ స్థాయిలో జీతములు.

ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా భర్తీ చేయబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది. NBCC Jobs Recruitment Telugu 2021

NBCC(ఇండియా) లిమిటెడ్ లో భర్తీ చేయబోయే ఈ పోస్టులకు సంబంధించిన విధి - విధానాలను మనం ఇపుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది  :    డిసెంబర్ 9, 2021

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :    జనవరి 8, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

ప్రస్తుత ఖాళీలు  :

డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)      -        10

మేనేజ్ మెంట్ ట్రైనీ ( సివిల్ )                 -        40

మేనేజ్ మెంట్ ట్రైనీ ( ఎలక్ట్రికల్ )             -       15

బ్యాక్ లాగ్ ఖాళీలు   :

ప్రాజెక్ట్ మేనేజర్ ( సివిల్ )                         -     1

సీనియర్ స్టేనో గ్రాఫర్                               -     1

ఆఫీస్ అసిస్టెంట్ (స్టేనో గ్రాఫర్ )               -    3

మొత్తం ఖాళీలు   :

మొత్తం 70 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /సివిల్  ఇంజనీరింగ్ /మొదలైన విభాగాలలో ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

స్టేనో గ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకోవలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి, హిందీ/ఇంగ్లీష్ స్టేనోగ్రఫీ లో నైపుణ్యం కలిగి ఉండాలి అని ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

గేట్ 2021 పరీక్షలో ఉత్తిర్ణత మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు.

వయసు   :

25 సంవత్సరాలు నుండి 47 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఉద్యోగాల విభాగాలను అనుసరించి జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు నుండి 1000 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.

బ్యాక్ లాగ్ పోస్టులకు దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులు లేవు అని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఎలా ఎంపిక చేస్తారు:

పర్సనల్ ఇంటర్వ్యూ /గేట్ 2021 స్కోర్ /స్కిల్ టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,430 రూపాయలు నుండి 1,60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

TTD లో ఉద్యోగాల పై వచ్చిన ప్రకటన Click Here

వైజాగ్ లో ఉద్యోగాల భర్తీ Click Here

మెట్రో రైల్ లో జాబ్స్ Click Here

Post a Comment

0 Comments