ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నగరంలో APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా లో ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి.
ప్రముఖ సంస్థలు విశాల్ మెగా మార్ట్, వరుణ్ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ సంస్థలలో గల వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న
సుమారు 100కు పైన పోస్టుల భర్తీకి నిర్వహించనున్న జాబ్ మేళా కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
10వ తరగతి నుండి డిగ్రీ విద్యా అర్హతలు వరకూ కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పిస్తున్నట్లుగా APSSDC తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరంలో ఉన్న రిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పనితీరు / ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ /కాలవ్యవధిని పొడగింపు చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
APSSDC ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ ఇంటర్వ్యూ ల గురించి పూర్తి వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : డిసెంబర్ 6, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ & సైన్స్, రమణయ్య పేట, సర్పవరం జంక్షన్ దగ్గర, SRMT మాల్ (వెనుక ), కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సంస్థల వారీగా ఉద్యోగాలు :
విశాల్ మెగా మార్ట్
కుటుంబ కేర్ (ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ )
వరుణ్ మోటార్స్
అపోలో ఫార్మసీ
జాబ్ రోల్ :
సేల్స్ & మార్కెటింగ్ /కస్టమర్ సర్వీస్ - 15
ఫీల్డ్ సేల్స్ ప్రమోటార్స్ - 25
ఎవల్యూటర్స్ - 10
ఫార్మసిస్ట్ - 30
ఫార్మసీ అసిస్టెంట్ /ఫార్మసీ ట్రైనీ - 30
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా APSSDC ఆధ్వర్యంలో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్ /మెకానికల్ డిప్లొమా /డిగ్రీ /బీ -ఫార్మసీ /డి -ఫార్మసీ /ఎం -ఫార్మసీ మొదలైన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధన ను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
దరఖాస్తు విధానము :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 నుండి 16,200 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
ఈ జీతములతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9010737998
8331890681
9988853335
NOTE :
ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ రెస్యూమ్స్ ను ఎడ్యుకేషనల్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకుని వెళ్ళవలెను.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments